పూదీనాతో జ్ఞాపకశక్తి మెరుగు

Update: 2020-02-07 02:46 GMT

ఆకుకూరలను తరుచుగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు సక్రమంగా అందించగలుగుతాము..ఒక్కో ఆకుకూర శరీరంలోని ఒక్కో భాగాన్ని ప్రభావితం చేస్తాయి. గోంగూర తింటే ఐరన్ లభిస్తుందని పాలకూర తింటే రక్తలేమిని తగ్గించుకోవచ్చునని తెలుసు...అలాగే నిత్యం వంటల్లో వినియోగించే పుదీనా వంటకాలను మంచి ఫ్లేవర్‌ను అందించడంతోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వంటింటి చక్కటి ఔషధంగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పుదీనా వంటల్లో వినియోగించకుండానే దాని వాసన మనల్ని ఉత్తేజపరుస్తుంది. దీనిలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి.

వంటల్లో కాకుండా తరుచుగా పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల ఉబ్బసం రాదు. అలర్జీ సైతం మటుమాయమవుతుంది. ఇక శ్వాస సంబంధిత సమస్యలను పుదీనా పారద్రోలుతుంది. అలాగే జలుబు గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్న వారు సైతం పుదీనా ఆకులను తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది...ముఖ్యంగా ఈ ఆకులను తీసుకుని నీటిలో మరించి ఆ ఆవిరిని పీల్చుకోవడం వల్ల చక్కట మార్పును చూడవచ్చు. ఇక రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో కూడా పుదీనా కీలక పాత్ర వహిస్తుంటుంది. ఇందులో ఉండే సి, డి, ఇ, బి విటమిన్లు రెసిస్టెన్స్ పవర్‌ను పెంచుతాయి. ఇక తీవ్రమైన తలనొప్పితో బాధపడే వారు బామ్‌లని, ట్యాబ్లెట్స్‌ను వాడకుండా కాస్త పూదీనా ఆకులను తీసుకుని నలిపి ఆ రసాన్ని తలకు పట్టిస్తే...మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు ఆరుర్వేద వైద్యులు.

ఇక ముఖ్యంగా గర్భినీ స్త్రీలు వాంతులు, జీర్ణ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు వారు కాస్త పూదీనా ఆకులను తీసుకుని మరిగించి అందులో తేనె కలుపుకుని తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటితో పాటే నిద్రమేమితో బాధపడుతున్నా...మెంటల్ టెన్షన్స్‌ ఉన్నా...నోటి సమస్యలు ఉన్నా వారు పుదీనా ఆకులను మరిగించి ఆ కషాయాన్ని సేవిస్తే..మంచి ఫలితం దక్కుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుందుకు ఎనర్జీ డ్రింక్స్‌ను ప్రిఫర్చేసే బదులు పూదీనా కషాన్ని తాగిస్తే సహజసిద్ధమైన, మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే షుగర్ పేషెంట్లు పుదీనాను తరుచుగా తీసుకోవడం వవల్ల వ్యాది తీవ్ర తక్కుతుందని అంటున్నారు. కీళ్లనొప్పులతో బాధపడే వారు వీటిని తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

Tags:    

Similar News