Health News: 40 ఏళ్ల తర్వాత ఈ చిట్కాలు పాటిస్తే అస్సలు బరువు పెరగరు..!

Health News: మారుతున్న జీవనశైలిలో బరువు తగ్గడం పెద్ద సవాలుగా మారింది...

Update: 2022-04-13 07:30 GMT

Health News: 40 ఏళ్ల తర్వాత ఈ చిట్కాలు పాటిస్తే అస్సలు బరువు పెరగరు..!

Health News: మారుతున్న జీవనశైలిలో బరువు తగ్గడం పెద్ద సవాలుగా మారింది. వయసు పెరిగే కొద్దీ బరువు పెరగడం సర్వసాధారణం. వాస్తవానికి 40 ఏళ్లు దాటిన తర్వాత జీవక్రియ రేటు మందగించడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో బరువుని నియంత్రించడం పెద్ద సవాలు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే మంచి డైట్ పాటించాలని అందరికీ తెలుసు. అలాగే కొన్ని చిట్కాలు పాటిస్తే సులువుగా బరువు తగ్గవచ్చు.

ఆహారంలో చేపలను చేర్చండి

అన్నింటిలో మొదటిది ఆహారంలో చేపలని చేర్చుకోవాలి, ఇది మీ జీవక్రియను పెంచుతుంది. అంతేకాదు గ్రీన్ టీ కూడా తాగవచ్చు. ఇది ఖచ్చితంగా మీ బరువును తగ్గిస్తుంది. మీరు భోజనానికి ముందు నీరు ఎక్కువగా తాగితే తక్కువ తింటారు. దీని కారణంగా బరువు తగ్గుతారు. నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు. మీకు తగినంత నిద్ర ఉంటే బరువు పెరగరు. దీంతో పాటు అల్పాహారంలో విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

సోమరితనం అనేక వ్యాధులకు కారణం అవుతుంది. దీనివల్ల అందరు బరువు పెరుగుతున్నారు. మీరు యాక్టివ్‌గా ఉంటే ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి వారానికి కనీసం 3 సార్లు వ్యాయామం చేయాలి. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం మానెయ్యాలి. మాంసాహారం తక్కువగా తీసుకోవాలి. కూరగాయల భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News