Healthy Breakfast: టిఫిన్‌గా ఇవి తీసుకుంటే గుండెపోటు సమస్య ఉండదు..!

Healthy Breakfast: ఉదయాన్నే మంచి టిఫిన్‌ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

Update: 2022-09-28 04:59 GMT

Healthy Breakfast: టిఫిన్‌గా ఇవి తీసుకుంటే గుండెపోటు సమస్య ఉండదు..!

Healthy Breakfast: ఉదయాన్నే మంచి టిఫిన్‌ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. చాలా మంది ఆఫీసుకి వెళ్లాలనే తొందరలో టిఫిన్ తినరు. ఇది సరైన పద్దతి కాదు. అల్పాహారం దాటవేయడం వల్ల లిపోప్రొటీన్ (LDL) పెరుగుతుంది. దీనివల్ల మీరు ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏయే పదార్థాలు తినాలో తెలుసుకుందాం.

1. వోట్మీల్

టిఫిన్‌గా వోట్మీల్ తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దీనిని యాపిల్ ముక్కలు, పియర్ లేదా కొన్ని రాస్ప్బెర్రీస్, స్ట్రాబెర్రీలని కలుపుకొని తింటే పీచును పెంచుకోవచ్చు.

2. ఆరెంజ్

ఆరెంజ్ చాలా సాధారణమైన పండు. దీని జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఫైబర్‌తో పెద్ద మొత్తంలో లభిస్తుంది. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.

3. స్మోక్డ్ సాల్మన్

సాల్మన్ ఫిష్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గొప్ప మూలం. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. రక్తంలో ఉన్న ట్రైగ్లిజరైడ్‌ల సంఖ్యను తగ్గిస్తాయి. దీని కోసం మీరు టమోటాలు, కేపర్లు, నువ్వులు వంటి ఇతర టాపింగ్స్‌తో చేసిన సాల్మన్‌ను తినవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

4. గుడ్డులోని తెల్లసొన

పోషకాలు అధికంగా ఉండే అల్పాహారం కోసం చూస్తున్నట్లయితే గుడ్డులోని తెల్లసొనను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్‌ని పెంచదు. పెద్ద మొత్తంలో ప్రోటీన్ అందిస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

Tags:    

Similar News