Health: కాఫీలో నిమ్మకాయ కలుపుకొని తాగితే ఏమవుతుందో తెలుసా.?
Health: సోషల్ మీడియాలో బరువు తగ్గించే చిట్కాలు రోజూ వైరల్ అవుతున్నాయి. అందులో తాజాగా “లెమన్ కాఫీ” ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒక కప్పు బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగితే బెల్లీ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుందని చెబుతున్నారు. అయితే ఈ పద్ధతి నిజంగా ఎంతవరకు పనిచేస్తుంది? నిపుణులు ఏమంటున్నారు?
Health: కాఫీలో నిమ్మకాయ కలుపుకొని తాగితే ఏమవుతుందో తెలుసా.?
Health: సోషల్ మీడియాలో బరువు తగ్గించే చిట్కాలు రోజూ వైరల్ అవుతున్నాయి. అందులో తాజాగా “లెమన్ కాఫీ” ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒక కప్పు బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగితే బెల్లీ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుందని చెబుతున్నారు. అయితే ఈ పద్ధతి నిజంగా ఎంతవరకు పనిచేస్తుంది? నిపుణులు ఏమంటున్నారు?
శరీరంపై కాఫీ ప్రభావం ఎలా ఉంటుంది.?
కాఫీలో ఉండే కేఫిన్ సహజమైన స్టిమ్యులెంట్. ఇది తాత్కాలికంగా మెటాబాలిజాన్ని కొంత వేగంగా పనిచేయేలా చేయగలదు. అలాగే అలసట తగ్గించి శరీరానికి చురుకుదనం ఇస్తుంది. కొందరికి కొద్దిసేపు ఆకలి తగ్గినట్లు అనిపించవచ్చు. అయితే ఈ ప్రభావం ఎక్కువసేపు ఉండదు. శరీరం కేఫిన్‌కు అలవాటు పడిన తర్వాత దాని ప్రభావం తగ్గిపోతుంది. కేవలం కాఫీ తాగడం వల్లనే పెద్దగా బరువు తగ్గడం సాధ్యం కాదు. సరైన ఆహారం, వ్యాయామం లేకుండా బరువు తగ్గడం కష్టం.
లెమన్ కాఫీతో నిజంగా బరువు తగ్గొచ్చా.?
నిమ్మకాయలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిమ్మరసం కలిపిన నీరు తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ లభిస్తుంది, జీర్ణక్రియకు కొంత సహాయం చేస్తుంది. అయితే కాఫీలో నిమ్మరసం కలిపితే ఫ్యాట్ వేగంగా కరిగిపోతుందని చెప్పే శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆరోగ్య నిపుణుల ప్రకారం నిమ్మకాయ గుణాలు నీటిలో కలిపినా, ఇతర డ్రింక్స్‌లో కలిపినా పెద్దగా మారవు. కాఫీ, నిమ్మరసం రెండూ తాత్కాలికంగా ఆకలి తగ్గించవచ్చు. అందువల్ల కొంతమంది తక్కువ ఆహారం తీసుకోవచ్చు. కానీ దీన్ని బరువు తగ్గించే పద్ధతిగా చూడడం సరైంది కాదు.
లెమన్ కాఫీ ఎలా చేస్తారు.?
లెమన్ కాఫీ తయారు చేయడం చాలా సులభం. ఒక కప్పు బ్లాక్ కాఫీలో అర నిమ్మకాయ రసం కలిపితే ఈ డ్రింక్ సిద్ధమవుతుంది. అయితే ఈ రుచిని అందరూ ఇష్టపడరు. అందుకే సాధారణంగా కాఫీ షాపుల మెనూలో ఇది కనిపించదు. కొన్ని దేశాల్లో చల్లని తీపి కాఫీకి నిమ్మరసం కలిపిన పానీయాన్ని “మజాగ్రాన్” అని పిలుస్తారు. ఇది అల్జీరియాలో ప్రారంభమై పోర్చుగల్‌లో ప్రాచుర్యం పొందింది.
దీనివల్ల ఏవైనా సమస్యలు ఉంటాయా?
సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్దలు పరిమితంగా లెమన్ కాఫీ తాగితే పెద్ద సమస్య ఉండదు. కానీ కాఫీ, నిమ్మరసం రెండూ అమ్ల పదార్థాలు కావడంతో కలిపి తాగితే ఆమ్లత్వం మరింత పెరుగుతుంది. అందువల్ల ఆసిడిటీ, గ్యాస్ట్రిటిస్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది అసౌకర్యం కలిగించవచ్చు. దంతాల ఇనామెల్‌కు కూడా నష్టం కలగవచ్చు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగితే గుండెల్లో మంట వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.