Sunlight Vastu: ఇంట్లోకి దక్షిణ దిశ నుంచి సూర్యకాంతి రావడం మంచిదేనా.? శాస్త్రం ఏం చెబుతోందంటే
Sunlight Vastu: ఇల్లు కొనుగోలు చేసే సమయంలో లేదా అద్దెకు తీసుకునే సమయంలో చాలా మంది ముందుగా చూసే విషయం సూర్యకాంతి ఇంట్లోకి వస్తుందా లేదా అన్నదే. ఉదయం సూర్యకిరణాలు ఇంట్లోకి వస్తే అది ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యకాంతి ఏ దిశ నుంచి ఇంట్లోకి వస్తుందో అనేదానికి కూడా ప్రాధాన్యం ఉంది.
Sunlight Vastu: ఇంట్లోకి దక్షిణ దిశ నుంచి సూర్యకాంతి రావడం మంచిదేనా.? శాస్త్రం ఏం చెబుతోందంటే
Sunlight Vastu: ఇల్లు కొనుగోలు చేసే సమయంలో లేదా అద్దెకు తీసుకునే సమయంలో చాలా మంది ముందుగా చూసే విషయం సూర్యకాంతి ఇంట్లోకి వస్తుందా లేదా అన్నదే. ఉదయం సూర్యకిరణాలు ఇంట్లోకి వస్తే అది ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యకాంతి ఏ దిశ నుంచి ఇంట్లోకి వస్తుందో అనేదానికి కూడా ప్రాధాన్యం ఉంది.
వాస్తు ప్రకారం సూర్యకాంతి ప్రాముఖ్యత
వాస్తు శాస్త్రంలో సూర్యకాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడిని జీవశక్తికి మూలంగా భావిస్తారు. ఇంట్లోకి సహజంగా సూర్యకిరణాలు రావడం వల్ల అక్కడ సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం ఉంది. అలాగే ఇంటి వాతావరణం చల్లగా, ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా సూర్యకాంతి సహాయపడుతుంది. సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశిస్తే ప్రతికూల శక్తి తగ్గి మంచి ఆలోచనలు, ఉత్సాహం పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇల్లు, కార్యాలయం, వ్యాపార స్థలం లేదా దేవాలయం వంటి ప్రదేశాల్లో సహజ కాంతి ఉండేలా నిర్మాణం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
తూర్పు దిశ నుంచి వచ్చే సూర్యకాంతి ఎందుకు శుభం?
వాస్తు ప్రకారం తూర్పు దిశ నుంచి ఇంట్లోకి వచ్చే సూర్యకిరణాలు చాలా శుభప్రదంగా భావిస్తారు. ఉదయం సూర్యోదయ సమయంలో వచ్చే ఈ కాంతి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఇంట్లోకి తూర్పు దిశ నుంచి కాంతి వస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుందని, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగుంటుందని నమ్మకం ఉంది. అలాగే పనుల్లో విజయాలు, ఆదాయం పెరగడం వంటి మంచి ఫలితాలు కూడా కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య దిశల నుంచి వచ్చే కాంతి మరింత శుభప్రదంగా భావిస్తారు.
పశ్చిమ దిశ నుంచి వచ్చే సాయంత్రపు కాంతి
సాయంత్రం సమయంలో పశ్చిమ దిశ నుంచి ఇంట్లోకి వచ్చే సూర్యకాంతిని కూడా వాస్తు శాస్త్రం మంచిదిగా భావిస్తుంది. సూర్యాస్తమయం సమయంలో వచ్చే ఈ కాంతి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతుందని అంటారు. సూర్యుడిని ఆరోగ్యానికి మూలంగా భావించడం వల్ల కిరణాలు ఇంట్లోకి రావడం శుభంగా పరిగణిస్తారు. ఈ కాంతి వల్ల ఇంట్లోని వాతావరణం ఉల్లాసంగా మారుతుందని కూడా నమ్మకం ఉంది.
దక్షిణ – నైరుతి దిశల నుంచి వచ్చే కాంతి విషయంలో జాగ్రత్త
వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ లేదా నైరుతి దిశల నుంచి సూర్యకిరణాలు నేరుగా ఇంట్లోకి రావడం అంతగా మంచిదిగా పరిగణించరు. ఈ దిశల నుంచి వచ్చే కాంతి కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలు కలిగించవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఇంటి ప్రధాన భాగాలు, పూజ గది లేదా ముఖ్యమైన గదుల్లో ఈ దిశల నుంచి అధికంగా కాంతి రావడం మంచిది కాదని సూచిస్తారు. అందుకే ఇల్లు నిర్మించే సమయంలో దిశల గురించి ముందుగా ఆలోచించడం అవసరం. వీలైనంత వరకు దక్షిణ దిశలో తలుపులు, కిటికీలు లేకుండా చూసుకుంటే మంచిది.
ఇల్లు నిర్మాణంలో సూర్యకాంతి ఎలా ఉండాలి?
ఇల్లు, అపార్ట్‌మెంట్ లేదా కార్యాలయం ఏదైనా సరే సహజ కాంతి వచ్చేలా నిర్మాణం ఉండటం మంచిది. కిటికీలు, బాల్కనీలు, ప్రధాన ద్వారం వంటి ప్రాంతాల ద్వారా సూర్యకాంతి ఇంట్లోకి రావడం వాస్తు ప్రకారం శుభంగా భావిస్తారు. సూర్యకిరణాలు ఇంట్లోకి రావడం వల్ల గాలి ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అలాగే ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది. వాస్తు నిపుణుల ప్రకారం సరైన దిశల నుంచి వచ్చే సూర్యకాంతి ఇంటికి శుభఫలితాలు, సానుకూల శక్తి తీసుకువస్తుంది.
గమనిక: ఈ వివరాలను ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.