Health Tips: చలికాలంలో ఇవి తింటే వెచ్చగా ఉంటుంది.. వ్యాధుల బెడద ఉండదు..!

Health Tips: శీతాకాలంలో చల్లదనం కారణంగా లేచి కూర్చోవడమే కష్టంగా ఉంటుంది.

Update: 2022-11-16 15:00 GMT

Health Tips: చలికాలంలో ఇవి తింటే వెచ్చగా ఉంటుంది.. వ్యాధుల బెడద ఉండదు..!

Health Tips: శీతాకాలంలో చల్లదనం కారణంగా లేచి కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. ఈ చల్లటి గాలుల కారణంగా అనేక వ్యాధులు సంభవించే ప్రమాదం పొంచి ఉంటుంది. శరీరం చల్లగా ఉండడం వల్ల వ్యాధులు త్వరగా తీవ్రమవుతాయి. అందుకే తినే తిండి, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలన్నా శరీరంలో ఎనర్జీ కావాలన్నా శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలు తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

బెల్లం

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చలి రోజుల్లో బెల్లం తినడం వల్ల వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే బెల్లం గుణం వేడిని కలిగి ఉంటుంది. శీతాకాలంలో బెల్లంతో తయారుచేసిన లడ్డూలు, తింటే చాలా మంచిది. శరీరం వెచ్చగా ఉండాలంటే బెల్లం టీ లేదా బెల్లం పాలు తాగవచ్చు.

తేనె

తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తేనె తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. రోజూ ఒక చెంచా తేనె తీసుకుంటే జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.

అల్లం

అల్లం ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. చలికాలంలో అల్లం టీ తాగడం వల్ల శరీరంలో చురుకుదనం వస్తుంది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

సూప్

చలికాలంలో వేడి పదార్థాలు తినాలి. సూప్ వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కూరగాయలతో చేసిన సూప్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎముకలు దృఢంగా మారడంతోపాటు కండరాలు చురుగ్గా ఉండేలా చేయడంలో సూప్‌లు సహాయపడతాయి.

గుడ్డు

గుడ్డులో ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు తినడం వల్ల జలుబు తగ్గుతుంది. శీతాకాలంలో ఉడికించిన గుడ్డు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్డులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Tags:    

Similar News