Health Tips: యువతకి అలర్ట్​.. సరిపడా నీరు తాగకుంటే చిన్న వయసులోనే ఈ ప్రమాదం..!

Health Tips: ఈ రోజుల్లో చాలామంది పని ఒత్తిడిలో పడి సరిపడా నీరు తాగడం లేదు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Update: 2023-10-16 06:16 GMT

Health Tips: యువతకి అలర్ట్​.. సరిపడా నీరు తాగకుంటే చిన్న వయసులోనే ఈ ప్రమాదం..!

Health Tips: ఈ రోజుల్లో చాలామంది పని ఒత్తిడిలో పడి సరిపడా నీరు తాగడం లేదు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి శరీరంలో ఎక్కువ శాతం నీరు మాత్రమే ఉంటుంది. లేదంటే శరీర వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందుకే దాహంతో సంబంధం లేకుండా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. నీరు తాగకపోతే డీ హైడ్రేషన్​తో పాటుగా మరొక ప్రమాదకరమైన సమస్య ఎదురవుతోంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడితే కీలక అవయవాలైన కాలేయం, కండరాలు, కీళ్ల పనితీరు మందగిస్తుంది. అయితే మరొక వైపు కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. శరీరంలో నీటి శాతం తగ్గితే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల మోతాదులు పెరుగుతాయి. కాలేయం రక్తంలోకి ఎక్కువగా కొలెస్ట్రాల్ ని విడుదల చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రక్తంలో ఉండే కొలెస్ట్రాల్‌ను తొలగించే ప్రక్రియ సైతం నెమ్మదిస్తుందని అంటున్నారు. దీంతో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.

గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే సరిపడా నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగితే కొలెస్ట్రాల్‌ తక్కువగా రక్తంలోకి విడుదలవుతుంది. దీనివల్ల గుడెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దాహం వేసినా వేయకపోయినా క్రమం తప్పకుండా నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి కచ్చితంగా నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజులో కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. దీనివల్ల 80 శాతం వరకు రోగాలు దరిచేరకుండా ఉంటాయి.

Tags:    

Similar News