Heart Attack: ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు.. ఆస్పత్రికి వెళ్లకపోతే అంతే సంగతులు..!

Heart Attack: భారతదేశంతో సహా ప్రపంచంలో హృద్రోగుల సంఖ్య చాలా పెరిగింది.

Update: 2022-10-27 10:07 GMT

Heart Attack: ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు.. ఆస్పత్రికి వెళ్లకపోతే అంతే సంగతులు..!

Heart Attack: భారతదేశంతో సహా ప్రపంచంలో హృద్రోగుల సంఖ్య చాలా పెరిగింది. దీనికి కారణం పేలవమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. అయితే చాలాసార్లు ప్రజలు ఫిట్‌గా కనిపించినప్పటికీ సమస్యల బారిన పడుతుంటారు. ఇటీవల కాలంలో నటుడు సిద్ధార్థ్ శుక్లా, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, గాయకుడు కెకె, రాజు శ్రీవాస్తవ సహా చాలా మంది ప్రముఖులు గుండెపోటుతో మరణించారు. గుండె జబ్బుల లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం.

1. ఛాతీ నొప్పి

మీకు తరచుగా ఛాతీ నొప్పి లేదా భారంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. మీకు గుండె జబ్బులు ఉండే అవకాశం ఉంది. సకాలంలో చికిత్స పొందండి.

2. వాంతులు

చాలా సార్లు ఛాతీ నొప్పి తర్వాత వాంతులు మొదలవుతాయి. ఇది గుండె జబ్బులని సూచించే ప్రమాదకరమైన లక్షణం. వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి.

3. కడుపునొప్పి

కడుపునొప్పి అనేక కారణాల వల్ల వచ్చినప్పటికీ గుండె జబ్బుల లక్షణం కూడా అవుతుంది. దీన్ని తేలికగా తీసుకోవద్దు. సరైన కారణాలను తెలుసుకోవాలి.

4. దవడలో నొప్పి

మీరు తరచుగా దవడలో నొప్పిని కలిగి ఉంటే అది గుండె జబ్బులకు సంబంధించినదై ఉంటుంది. దీని కోసం వెంటనే పరీక్ష చేయించుకోవడం అవసరం. లేదంటే ప్రాణాపాయం ఉంటుంది.

5. ఆకస్మిక చెమటలు

వేసవి రోజులలో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు ఆకస్మికంగా చెమటలు పట్టడం సర్వసాధారణం. అయితే శరీరం ఏసీ గదిలో లేదా ఎటువంటి శ్రమ చేయనప్పుడు కూడా చెమటలు పడితే అది గుండెపోటుకు సంకేతం.

Tags:    

Similar News