Men Fitness Tips: మగవారు బరువు తగ్గాలంటే ఈ డైట్‌ సూపర్.. కొద్ది రోజుల్లోనే అద్భుత ఫలితం..!

Men Fitness Tips: చాలా మంది పురుషులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపరు.

Update: 2022-12-22 14:00 GMT

Men Fitness Tips: మగవారు బరువు తగ్గాలంటే ఈ డైట్‌ సూపర్.. కొద్ది రోజుల్లోనే అద్భుత ఫలితం..!

Men Fitness Tips: చాలా మంది పురుషులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపరు. దీని కారణంగా విపరీతంగా బరువు పెరుగుతారు. తర్వాత బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికి ఎటువంటి ఫలితం ఉండదు. మీరు పెరిగిన బరువుని తగ్గించుకోవాలంటే ముందుగా ప్రత్యేక డైట్‌ ఫాలో కావాలి. ఎలాంటి డైట్‌ అనుసరించడం వల్ల ఫిట్‌గా ఉంటారో ఈ రోజు తెలుసుకుందాం.

మార్నింగ్ డిటాక్స్ వాటర్

బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే ప్రతిరోజూ ఉదయం దోసకాయ నీటిని తాగాలి. ఇది కాకుండా బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని కూడా తాగవచ్చు.

అల్పాహారం

బరువు తగ్గడం వల్ల చాలా మంది అల్పాహారం మానేస్తారు. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల బరువు తగ్గడానికి బదులు పెరుగుతారు. బరువు తగ్గాలనుకుంటే రోజూ బ్రేక్ ఫాస్ట్ చేయాలి.

మధ్యాహ్న భోజనం

బరువు తగ్గడం కోసం మధ్యాహ్న భోజనం మానేయవద్దు. లంచ్ ప్రతి వ్యక్తికి భారీగా ఉండాలి. లంచ్‌ స్కిప్‌ చేస్తే మరింత బరువు పెరుగుతారు.

స్నాక్స్

స్నాక్స్ అంటే సాయంత్రం 5 గంటల తర్వాత కొన్ని స్నాక్స్ తీసుకోవాలి. ఇందులో కాఫీ, మజ్జిగ మొదలైనవాటిని చేర్చుకోవచ్చు.

డిన్నర్

డిన్నర్ ఎప్పుడూ తేలికగా ఉండాలి. రాత్రి భోజనం ఎల్లప్పుడూ నిద్రకి 3 గంటల ముందే తినాలి. అప్పుడే నిద్ర సరిగ్గా పడుతుంది. ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. బరువు తగ్గాలంటే ఆహారాన్ని వదిలేయడం కాదు. మంచి ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకోవడం. దీనివల్ల ఒక క్రమపద్దతిలో బరువు తగ్గవచ్చు.

Tags:    

Similar News