Turmeric Benefits: పసుపుతో మధుమేహ రోగులకు అద్భుత ప్రయోజనాలు..!

Turmeric Benefits: పసుపుతో మధుమేహ రోగులకు అద్భుత ప్రయోజనాలు..!

Update: 2022-07-08 03:00 GMT

Turmeric Benefits:పసుపుతో మధుమేహ రోగులకు అద్భుత ప్రయోజనాలు..!

Turmeric Benefits: పసుపు ప్రతి ఇంటిలో సులభంగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి, చర్మానికి రెండింటికీ మేలు చేస్తుంది. పసుపు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు పసుపు మధుమేహా రోగులకి చాలా మంచిది. కాబట్టి వీరు పసుపును తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే అది ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం.

డయాబెటిక్ రోగులకు పసుపు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో కర్కుమిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహ రోగులు పసుపు, దాల్చిన చెక్కను కలిపి తీసుకోవాలి. ఇందుకోసం ఒక గ్లాసు పాలలో పసుపు, దాల్చిన చెక్క పొడిని వేయాలి. ఈ పాలని కొద్దిగా వేడిచేసి తాగాలి. పసుపుతో పాటు దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

అలాగే పసుపుతో పాటు నల్లమిరియాలు కలిపి తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్ల బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పాలలో చిటికెడు పసుపు, కొన్ని నల్లమిరియాలు వేసి కొద్దిగా వేడి చేసి తీసుకుంటే చాలా మంచిది. అంతేకాదు పాలలో కొద్దిగా ఉసిరికాయ పొడి, పసుపును మిక్స్ చేసి తాగవచ్చు. ఈ మిశ్రమం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Tags:    

Similar News