ఆలూ కొబ్బరి రైస్ తయారుచేసుకునే విధానం!
రుచికరమైన కూరగాయల్లో బంగాళదుంప ఒకటి. కూరగాయల రాజుగా పేరుగడించిన బంగాళదుంపలను తినేందుకు చిన్నపిల్లలు ఇష్టపడుతుంటారు.
రుచికరమైన కూరగాయల్లో బంగాళదుంప ఒకటి. కూరగాయల రాజుగా పేరుగడించిన బంగాళదుంపలను తినేందుకు చిన్నపిల్లలు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా అలూతో తయారు చేసిన ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ అంటే లొట్టలేసుకుని లాగించేస్తారు.. ఆలూలో నీరూ మరియు కార్బోహైడ్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. దీంతో చాలా మంది ప్రస్తుతం తక్కువ కార్బోహైడ్రేట్‌లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలనుకుంటున్నారు..అయినా కానీ అలూకి ఉన్న క్రేజే వేరు..ఇంట్లో వారంలో రెండు మూడు పూటలు ఆలూ తో చేసిన కూర ఉండాల్సిందే..మరి డెయిలీ రొటీన్ గా చేసుకునే కూరలు , వేపుళ్లు కాకుండా రైస్ తో కలిపి , కొబ్బరిని దట్టించి ఒక స్పెషల్ వంటకం చేద్దాం..అదే కొబ్బరి ఆలూ రైస్..
కొబ్బరి ఆలూరైస్‌కి కావాల్సిన పదార్ధాలు:
♦ బియ్యం : రెండు కప్పులు
♦ పచ్చికొబ్బరి : అరకప్పు (తురిమి పెట్టుకోవాలి)
♦ బంగాళదుంప లు : నాలుగు
♦ పచ్చిమిర్చి : నాలుగు
♦ దాల్చీనీ : తగినంత
♦ లవంగాలు : ఎనిమిది
♦ నెయ్యి : టేబుల్ స్పూన్
♦ ఉప్పు: టేస్టుకు తగ్గట్లుగా
♦ యాలాకులు : నాలుగు
♦ జీలకర్ర : ½ టీస్పూన్
♦ కరివేపాకు : మూడు రెబ్బలు
♦ ఎండుమిర్చి : రెండు
♦ నీళ్లు : నాలుగు కప్పులు
♦ మినపప్పు : టీస్పూన్
♦ శనగపప్పు : టేబుల్‌స్పూన్
తయారీ విధానం:
ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగాలి తరువాత బియ్యాన్ని నీటిలో కాసేపు నానబెట్టాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసి దానిని వేడిచేసుకోవాలి. పోపులైన జీలకర్ర, మిననప్పు, శనగపప్పు వవేయాలి. లో ఫ్లేమ్‌లో నే ముందుగా పోపు పప్పులను వేయించుకోవాలి. ఇవి చిటపటలాడాక అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, దాల్చీని చెక్క, లవంగాలు వేయాలి. వీటన్నింటిని రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. తరువాత నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు వడగట్టి వేయాలి. వీటిని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి. ఒప్పుడు తరిమి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేయాలి. ఇప్పుడు కరివేపాకు, ఉప్పు, నీళ్లు ఒకదాని తరువాత ఒకటి వేసి కలపాలి. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టుకోవాలి. సిమ్‌లో 20 నిమిషాల పాటు బియ్యాన్ని ఉడికించాలి. అంతే టేస్టీ ఆలూ కొబ్బరి రైస్ రెడీ .
చలికాలంలో చాలా మంది హాట్ హాట్ ఫుడ్‌ను తినేందుకు ఇష్టపడుతుంటారు.. ఎప్పుడూ రొటీన్‌గా అన్నం , కూర కాకుండా ఇలా స్పెషల్ డిషెస్ వండుకుంటే ఇంటిళ్లపాది టేస్టీ ఫుడ్‌ను లాగించేయవచ్చు.