ఎలా వండినా తినగలిగేటంత రుచి.. అలసందల కూర తయారీ ఎలా?

Update: 2020-02-26 06:40 GMT

నవధాన్యాలైన అలసందల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ధరకే లభించే అలసందల్లో మాంసకృతులు అధికంగా ఉంటాయి. వెజిటేరియన్స్‌కు ఇది చక్కటి పోషకాహారం. అలసందలను ఎలా వండినా తినగలిగేటంత రుచి వీటి సొంతం... మరి ఈ అలసందలతో చక్కటి వంటకాన్ని తయారు చేసుకుందాం పదండి.

కావాల్సిన పదార్ధాలు :

* అలసందలు

* టమాట

* అల్లం

* కారం

* జీలకర్ర పొడి

* ఉప్పు

* ఉల్లిగడ్డ

* పచ్చి మిర్చి

* కరివేపాకు

*కొత్తిమీర

తయారీ విధానం :

ఉదయం అలసందల కూర చేయాలనుకుంటే ముందుగా రాత్రి పూట అలసందలను నానబెట్టాలి. నానిన అలసందలను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. అందులో నూనె వేసుకోవాలి.. నూనె కాస్త కాగాక అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కలను కుక్కర్‌లో వేసుకోవాలి..ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు నాలుగు, పచ్చి మిర్చి రెండు, టీ స్పూన్ అల్లం తరుగు వేసుకోవలి. దీనితో పాటే ఒక టమాట ముక్కలు వేసుకోవాలి..

ఇప్పుడు నాలుగు కరివేపాకు రెబ్బలు, జీలకర్రపొడి, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. వీటన్నింటిని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అలసందలను వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక కప్పు అలసందలను వేసుకున్నాము కాబట్టి మూడు కప్పుల నీరు పోసుకోవాలి.. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి.. విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక విజిల్ తీసి మూత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నటి మంటను ఉంచాలి... చివరకు ఉప్పు కలుపుకోవాలి..ఇప్పుడు కొత్తిమీర చల్లి దింపుకోవాలి... అంతే వేడి వేడి అలసందల కూర రెడీ... ఇది పరాటాలతో కానీ చపాతీలకు గానీ రైస్ ఐటమ్‌తో గాని మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీటిలో కలిపి ఈ కూర తీసుకుంటే ఆ రుచే వేరు.  

Tags:    

Similar News