Egg Expired: కోడిగుడ్డు ఎక్స్‌పైరీ అయిందా లేదా తెలుసుకోవడం ఎలా..?

Egg Expired: గుడ్లు తినడం అంటే కొంతమందికి చాలా ఇష్టం. దాదాపు ప్రతిరోజు గుడ్లతో తయారుచేసిన వంటకాలని తింటారు.

Update: 2022-06-06 09:15 GMT

Egg Expired: కోడిగుడ్డు ఎక్స్‌పైరీ అయిందా లేదా తెలుసుకోవడం ఎలా..?

Egg Expired: గుడ్లు తినడం అంటే కొంతమందికి చాలా ఇష్టం. దాదాపు ప్రతిరోజు గుడ్లతో తయారుచేసిన వంటకాలని తింటారు. అయితే గుడ్లకి కూడా ఎక్స్‌పైరీ ఉంటుందని చాలామందికి తెలియదు. దీంతో ఏ గుడ్లని పడితే ఆ గుడ్లతో వంటకాలు వండి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. అయితే గుడ్డు ఎక్స్‌పైరీ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక పరీక్ష చేయాలి. అది ఎలాగో తెలుసుకుందాం.

తాజా గుడ్లను ఎలా గుర్తించాలి..?

మీరు ఒక గిన్నెలో నీటిని నింపండి. అందులో గుడ్లని వేయండి. గుడ్డు నీటిపై తేలినట్లయితే అది చెడిపోయిందని అర్థం. దానిని ఆహారం కోసం ఉపయోగించకూడదు. ఒకవేళ గుడ్డు నీటిలో నిటారుగా నిలబడితే అది చాలా పాతదని అర్థం. కానీ దానిని ఆహారంగా ఉపయోగించవచ్చు. అలాగే నీటిలో గుడ్డు పూర్తిగా మునిగి ఉంటే అది తాజా గుడ్డు అని అర్థం.

మీరు బయట గుడ్డుతో చేసిన ఆమ్లెట్, ఎగ్ రోల్ లేదా తదితర వంటకాలలో ఎలాంటి గుడ్లు ఉపయోగించారో తెలియదు. ఈ పరిస్థితిలో 24 గంటల నుంచి తదుపరి 3 నుంచి 4 రోజుల వరకు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. చెడిపోయిన గుడ్డు తిన్న తర్వాత శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కడుపు నొప్పి, కడుపు నొప్పితో కూడా తిమ్మిరి, వికారం, వాంతులు, విరేచనాలు, అతిసారం, అధిక జ్వరం సంభవించవచ్చు.

Tags:    

Similar News