Health Tips: చలికాలంలో బచ్చలి కూర తింటే అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?

Health Tips: బచ్చలికూరలో మెదడు, గుండె, కళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి.

Update: 2022-11-23 08:00 GMT

Health Tips: చలికాలంలో బచ్చలి కూర తింటే అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?

Health Tips: చలికాలం రాగానే చాలా సమస్యలు మొదలవుతాయి. ఈ సీజన్‌లో కొందరికి బీపీ, కొందరికి చర్మ సమస్యలు ఏర్పడుతాయి. అందుకే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాస్తవంగా శీతాకాలాన్ని కూరగాయల సీజన్ అని పిలుస్తారు. ఈ సీజన్ లో బచ్చలికూర, పాలకూర కూడా లభిస్తుంది. అయితే బచ్చలికూరలో తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు ఉంటుంది. ఇది అనేక సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. బచ్చలికూరలో మెదడు, గుండె, కళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. చలికాలంలో బచ్చలికూర తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కళ్ళు సురక్షితం

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే బచ్చలికూర కళ్లకు రక్షణగా పనిచేస్తుంది. రోజూ బచ్చలికూర తింటే కళ్లకు సంబంధించిన సమస్యలు ఉండవు. కళ్ల కాంతి కూడా మెరుగవుతుంది. కంటికి సంబంధించిన సమస్య ఉంటే బచ్చలికూర తీసుకోవడం ప్రారంభించండి.

ఎముకలు ఆరోగ్యం

బచ్చలికూర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఎముకలకు కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే బచ్చలికూరలో విటమిన్ కె, కాల్షియం ఉంటుంది. మీకు ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉంటే ఆహారంలో బచ్చలికూరని చేర్చుకోవచ్చు.

అధిక రక్తపోటు

బచ్చలికూరలో సహజంగా లభించే రసాయనాలు నైట్రేట్‌లు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటునుంచి కాపాడుతాయి. రోజూ బచ్చలికూరను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు కచ్చితంగా బచ్చలికూర తీసుకోవాలి.

Tags:    

Similar News