Health Tips: దంతాలు పసుపురంగులోకి మారాయా.. ఇంట్లోనే ఇలా మెరిసేలా చేసుకోండి..!

Health Tips: అయితే పసుపు రంగు దంతాలని చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు.. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం

Update: 2022-11-26 04:16 GMT

Health Tips: దంతాలు పసుపురంగులోకి మారాయా.. ఇంట్లోనే ఇలా మెరిసేలా చేసుకోండి..!

Health Tips: ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. కానీ దంతాలను ఎవ్వరూ పట్టించుకోరు. కొంతమంది దంతాలను సరిగ్గా శుభ్రం చేయరు. దీంతో నెమ్మదిగా వాటిపై పసుపురంగు ఏర్పడుతుంది. ఇది చెడుగా కనిపిస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని మసకబారుస్తుంది. గుట్కా, పాన్‌మసాల తినడం వల్ల చాలా మంది దంతాలు పాడైపోయి పసుపు రంగులోకి మారుతాయి. అయితే పసుపు రంగు దంతాలని చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం.

నిమ్మరసం, బేకింగ్ సోడా

ఒక ప్లేట్‌లో 1 టీస్పూన్ బేకింగ్ సోడా తీసుకొని దానికి కొద్దిగా నిమ్మరసం కలపండి. ఈ పేస్ట్‌ను టూత్ బ్రష్‌పై అప్లై చేసి దంతాల మీద బాగా రుద్దండి. 1 నిమిషం అలాగే ఉంచి ఆపై కడగండి. ఈ పేస్ట్‌ను దంతాల మీద 1 నిమిషానికి మించి ఉంచవద్దు లేదంటే దంతాలు పాడయ్యే అవకాశం ఉంది.

తులసి

తులసిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. దీని ఆకులను దంతాలపై రుద్దండి. అది మీ దంతాలను శుభ్రపరుస్తుంది. ఇది బ్యాక్టీరియా, అనేక ఇతర విషాలను తొలగిస్తుంది.

గోరువెచ్చని నీరు

మీరు ప్రతిరోజూ సరిగ్గా బ్రష్ చేసి టీ-కాఫీ తాగిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే దంతాలు పసుపు రంగులోకి మారే అవకాశం చాలా తక్కువ. రోజూ ఆహారం తిన్నా లేదా టీ-కాఫీ తాగిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

నారింజ

మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ నారింజ తినడం వల్ల దంతాల పసుపు రంగు తొలగిపోతుంది. విటమిన్-సి నారింజలో లభిస్తుంది. ఇది దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. దంతాల బ్యాక్టీరియాను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఆపిల్

యాపిల్ తినడం వల్ల దంతాలకు ఉపశమనం లభిస్తుంది. మచ్చలు, పసుపు సమస్య తొలగిపోయి దంతాలు తెల్లగా మెరిసేలా ఉంటాయి. యాపిల్‌లో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సహజమైన ఏజెంట్‌గా పనిచేస్తుంది.

Tags:    

Similar News