Health Tips: మజ్జిగతో కలిపి దోసకాయ తీసుకోవచ్చా?

Health Tips: మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. కాబట్టి దీనిని తాగడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12 వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందించడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

Update: 2025-06-18 01:30 GMT

Health Tips: మజ్జిగతో కలిపి దోసకాయ తీసుకోవచ్చా?

Health Tips: మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. కాబట్టి దీనిని తాగడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12 వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందించడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇక దోసకాయలో విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, పుష్కలంగా నీరు ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాకుండా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అలాగే, ఇది బరువు నిర్వహణ తోపాటు చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మజ్జిగతో పాటు దోసకాయ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేద నిపుణుల ప్రకారం, మజ్జిగతో పాటు దోసకాయను కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది చల్లదనాన్ని అందించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అందువల్ల, వేడి వల్ల కలిగే నిర్జలీకరణాన్ని నివారించవచ్చు. దోసకాయ, మజ్జిగ కలిపి తీసుకుంటే జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

దోసకాయ, మజ్జిగ ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచివి కాబట్టి కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఒక దోసకాయ తీసుకొని, దానిని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోని వాటిని మిక్సీ లో గ్రైండ్ చేయండి. తర్వాత దాని గుజ్జును మజ్జిగలో కలపండి. మీరు దానికి పుదీనా ఆకులు, ఉప్పు, జీలకర్ర పొడిని కూడా కలుపుకోవచ్చు.

Tags:    

Similar News