Health Benefits with Muskmelon: కర్బూజతో ఆరోగ్య ప్రయోజనాలు..

Health Benefits with Muskmelon | కర్బూజ దోస జాతికి చెందిన పండు. దీని శాస్త్రీయ నామం కుకుమిస్ మెలో. మరొక పేరు కుకుర్బిట మాక్సిమా.

Update: 2020-09-17 04:32 GMT

Health Benefits with Muskmelon | కర్బూజ దోస జాతికి చెందిన పండు. దీని శాస్త్రీయ నామం కుకుమిస్ మెలో. మరొక పేరు కుకుర్బిట మాక్సిమా. ఇది దోస రకానికి చెందింది కాబట్టి దీన్ని కూరగాయ అనికొద్ది మంది వర్గీకరిస్తుంటారు. దీని పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ మాలోపల మాత్రం అంతా మెత్తగా ఉంటుంది. కొన్ని రకాల్లో తోలు కూడా పలుచగానే ఉంటుంది.

ఇవి పక్వానికి వచ్చే తరుణంలో ఒక రకమైన వాసనను వెలువరిస్తాయి. మస్క్‌ డీర్అ నే ఒక రకమైన జింక నుండి కూడా ఒక అద్భుతమైన సువాసన వెలువడుతుంది. ఆ సువాసన గుర్తుకు తెచ్చేలా వుంటుంది కాబట్టి, ఈ వాసనను బట్టి వీటికి మస్క్‌ మెలన్‌ (muskmelon) అనే పేరు కూడా ఉంది. అయితే ఇవి మగ్గితేనే ఆ వాసన విడుదల చేస్తాయి.

కర్బూజ ఉపయొగాలు...

వీటిని కొన్నిసార్లు తాజాగా, మరికొన్నిసార్లు ఎండబెట్టి వినయోగిస్తారు. ఖర్బుజ విత్తనాలు ఎండబెటి వాటితొ దోస నూనె ఉత్పత్తికి ప్రక్రియ చేస్తారు. ఇంకొన్ని రకాలను వాటి సువాసన కొఱకే పెంచుతారు. జపనీయ మద్యం మిదోరిలో రుచి కొఱకు దీనిని వాడుతారు.ఈ పండు వేసవిలో మంచి చలువ చేయడమే కాకుండా, క్యాలరీలు లేని తీపిదనాన్ని ప్రసాదిస్తాయి. లేత నారింజ రంగులో వుండే గుజ్జు రుచిగా వుంటుంది. ఈ గింజల్ని కూడా ఎండబెట్టిన తర్వాత ఒలుచుకుని తింటారు. రకరకాల పంటల్లో వాడతారు.

ఆయుర్వేదంలో కూడా ఈ రసాన్ని చాలా రకాల సమస్యల నివారణకు సూచిస్తారు. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, మలబద్దకం, మూత్రనాళ సమస్యలు, ఎసిడిటి, అల్సర్‌ వంటి పరిస్థితుల్లో మా గుజ్జుని తగినంత నీటిలో కలిపి తాగితే మంచి మేలు. మేము శరీరంలో వేడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఆకలి పెంచుతాము. అలసట తగ్గిస్తాయి. అంత త్వరగా జీర్ణం కావు కానీ మంచి శక్తిని ఇస్తాయి. కొంతమంది లైంగిక శక్తి పెరుగుదలకు కూడా సూచిస్తారు. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు శ్రేష్ఠమైనది. 

కర్బూజలోని పోషక విలువలు...

పోషక విలువలు: ప్రతి వంద గ్రాములకు

♦ నీరు : 95.2 గ్రా,

♦ ప్రొటీన్ : 0.3 గ్రా,

♦ క్రొవ్వు : 0.2 గ్రామ్,

♦ పీచు : 0.4 గ్రా,

♦ కెరోటిన్ :169 మైక్రో గ్రాం,

♦ సి. విటమిన్ : 26 మి.గ్రా,

♦ కాల్షియం : 32 మి.గ్రా,

♦ ఫాస్పరస్ : 14 మి.గ్రా,

♦ ఐరన్ : 1.4 మి.గ్రా,

♦ సోడియం : 204.8 మి.గ్రా,

♦ పొటాషియం : 341 మి.గ్రా,

♦ శక్తి : 17 కిలో కాలరీలు.

Tags:    

Similar News