Custard Apple: సీతాఫలములోని పోషక విలువలు, ఉపయోగాలు..

Custered Apple: సీతాఫలము /రామాఫలము . శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం.

Update: 2020-08-30 03:41 GMT

Custard Apple

Custered Apple: సీతాఫలము /రామాఫలము . శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాల నివారణి. మరెన్నోసుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం. ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది. చూడడానికి ఒకే విధంగా ఉన్నా.. రుచి, వాసనలో కాస్త తేడా ఉంటుంది. సీజన్‌ వస్తోందంటే చాలు..

కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట.

సీతాఫలములోని  ఔషధ గుణాలు..

దీని ఆకులు, బెరడు, వేరు... ఇలా అన్ని భాగాల్నీ అక్కడ పలు వ్యాధుల నివారణలో వాడతారట. మనదగ్గర కూడా చాలామంది సెగ్గడ్డలకు వీటి ఆకుల్ని నూరి కట్టుకడతారు. వీటి ఆకులకు మధుమేహాన్ని తగ్గించడంతోపాటు బరువు కూడా తగ్గించే గుణం ఉందని ఇటీవల కొందరు నిపుణులు చెబుతున్నారు.

పోషకాలు:

* 100గ్రా. గుజ్జు నుంచి 94 క్యాలరీల శక్తి,

* 20-25గ్రా. పిండి పదార్థాలు,

* 2.5గ్రా. ప్రొటీన్లు,

* 4.4గ్రా. పీచూ లభ్యమవుతాయి.

ఇంకా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి.

ఉపయోగాలు..

* సీతాఫలం మంచి రుచికరమైన ఆహారం. వీనిలో కాల్షియమ్ సమృద్ధిగా ఉంటుంది.

* దీనిలో విటమిన్ 'సి' సంవృద్దిగా దొరుకుతుంది.

* ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలో కల పీచుపధార్ధం తోడ్పడుతుంది.

Tags:    

Similar News