Benefits of Sesame seeds: నువ్వులు ఆరోగ్య ప్రయోజనాలు

Benefits of Sesame seeds: పవర్ హౌస్ గా పిలుచుకునే నువ్వుల్లో వుండే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుందాం.

Update: 2021-04-25 05:13 GMT

Benefits of Sesame seeds:(besthealthinfo)

Benefits of Sesame seeds: తెల్లనువ్వులు, నల్ల నువ్వులు అంటూ ఇవి వేరు వేరుగా కనిపించినా ఈ రెంటిలోనూ పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయి. నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని 'పవర్ హౌజ్' అని పిలుస్తారు. నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ 'ఇ' కూడా సమృద్ధిగా ఉంటుంది. అలాంటి నువ్వుల వల్ల కలిగే ఉపయోగాలేంటో మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.

టాబ్లెట్స్ రూపంలో తీసుకునే కాల్షియం చాలా భాగం జీర్ణమే కాదు. కానీ నువ్వుల ద్వారా లభించే కాల్షియం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిల్లో 20 శాతం ప్రొటీన్ వుంటుంది. నువ్వుల్లో వుండే ఫైటో స్టెరాల్స్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వుల్లో ఫైటో స్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయి.

నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది. అలాగే ట్యూమర్(క్యాన్సర్ కణాలు )ఏర్పడకుండా నివారిస్తుంది. నల్ల నువ్వుల్లో క్యాన్సర్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్ లో ట్యూమర్ గ్రోత్ ను నివారిస్తాయి. దాంతో బ్రెయిన్ క్యాన్సర్ సమస్య ఉండదు . నల్లనువ్వుల నూనె వాడటం వల్ల చాలా తక్కువగా గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఇందులోవుండే మినరల్స్ హృదయనాళాలను చురుకుగా పనిచేసేలా చేస్తోంది. దెబ్బలు తగిలినప్పుడు తొందరగా మానటంలో చాలా సహాయం చేస్తుంది.

నువ్వులు ఫైబర్‌ను కలిగి ఉంటాయి. వీటినే లిగ్నిన్స్ అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. నల్ల నువ్వులలో ఉండే ఫైటోస్టేరోసిస్ కొవ్వును తగ్గిస్తూ కేన్సర్ కణాలను వృద్ధి చెందకుండా చేస్తుంది. నల్ల నువ్వులు రోజు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకి పంపి మన శరీరాన్ని నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ నువ్వుల్లో ఉండే పోషకాల వల్ల వయసు పెరిగిన అందం మాత్రం తగ్గకుండా చేస్తుంది.

నువ్వులల్లో ఉండే మూలాశక్తి వల్ల అల్ట్రావైలెట్ కిరణాల చర్మంపై పాడినప్పుడు ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత క్యాన్సర్‌ని నల్ల నువ్వలు తగ్గిస్తాయి. నువ్వుల విత్తనాలనుండి తీసిన నూనెలో శక్తి వంతమైన పదార్థాలు అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.

ఎప్పుడు షాంపూలు వాడిన జుట్టు కొన్ని రోజుల తరవాత తేలిపోతుంది. అలాంటి సమయంలో మీరు నువ్వుల నూనెను జుట్టుకు పట్టిస్తే నువ్వులలోని పోషకాలు జుట్టుకు బలాన్ని ఇచ్చి మీ జుట్టును తిరిగి మాములుగా చేస్తుంది. ఇప్పుడు చాలా మంది బ్యుటీషియన్స్ నువ్వుల నూనెను కేశాలంకారణలో వాడుతున్నారు. నువ్వుల్లో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు, నీరసంతో బలహీనంగా ఉండేవారు నువ్వులు, బెల్లం కలిపి ఉండలు చేసుకుని తింటే మంచిది.

Tags:    

Similar News