Health Tips: ఆ అనారోగ్య సమస్యలకు పరిష్కారం బ్లాక్‌ కాఫీ.. అవేంటో చూడండి

Update: 2025-01-19 15:00 GMT

Health benefits of black coffee: కాఫీ చాలా మందికి ఉండే అలవాట్లలో ఒకటి. ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. కాఫీ తాగకపోతే రోజు గడవని పరిస్థితి ఉంటుంది. అయితే కాఫీతో కొన్ని రకాల సమస్యలు ఉంటాయని కూడా అంటుంటారు. ముఖ్యంగా కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీని తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.

అయితే బ్లాక్‌ కాఫీని తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇంకొంతమంది నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా బ్లాక్‌ కాఫీని తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. రుచికి చేదుగా ఉండే బ్లాక్‌ కాఫీని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇంతకీ బ్లాక్‌ కాఫీని తీసుకోవడం కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* గుండె ఆరోగ్యాన్ని కాపాడంలో బ్లాక్‌ కాఫీ ఉపయోగపడుతుంది. బ్లాక్‌ కాఫీని రెగ్యులర్‌గా తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. బ్లాక్‌ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హానిచేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్‌, గుండె పోటు వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా ఉంటాయి. బ్లాక్ కాఫీని రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలో డోపమైన్‌ విడుదల అవుతుంది. ఇది డిప్రెష‌న్‌, ఆందోళ‌న‌, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను తగ్గిస్తుంది.

* బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రెగ్యులర్‌గా బ్లాక్‌ కాఫీని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీని తీసుకుంటే శ‌రీర మెట‌బాలిజం మెరుగవుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఇది శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌ వ్యాయామాలతో పాటు బ్లాక్‌ కాఫీని తీసుకోవాలనేది నిపుణలు చెబుతున్న సలహా.

* డయాబెటిస్‌తో బాధపడుతోన్న వారికి కూడా బ్లాక్ కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్లాక్‌ కాఫీని రెగ్యులర్‌గా తీసుకుంటే.. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో శ‌రీరం ఇన్సులిన్‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటుంది. ఈ కారణంగా శరీరంలో షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్‌ ఉన్నవారు, భవష్యత్తులో రాకుండా ఉండాలనుకునే వారు కచ్చితంగా బ్లాక్‌ కాఫీని తీసుకోవాలని చెబుతున్నారు

* జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా బ్లాక్‌ కాఫీ బాగా ఉపయోగపడుతుంది. బ్లాక్‌ కాఫీని రెగ్యులర్‌గా తీసుకంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. ముఖ్యంగా బలబద్ధకం తగ్గి, సుఖ విరేచనం అవుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ప్రాథమిక సమాచారంగానేగా భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News