Black Pepper: మలబద్దకంతో బాధపడుతున్నారా.. నల్లమిరియాలతో ఇలా చేయండి..!

Black Pepper: నల్ల మిరియాలు ఒక మసాలా దినుసు. దీనిని వంటలలో ఉపయోగించడం వల్ల రుచి పెరుగుతుంది.

Update: 2022-02-28 08:00 GMT

Black Pepper: మలబద్దకంతో బాధపడుతున్నారా.. నల్లమిరియాలతో ఇలా చేయండి..!

Black Pepper: నల్ల మిరియాలు ఒక మసాలా దినుసు. దీనిని వంటలలో ఉపయోగించడం వల్ల రుచి పెరుగుతుంది. ఏదైనా నాన్‌వెజ్‌ వంటకాన్ని స్పైసీగా వండాలంటే నల్ల మిరియాల పొడి కచ్చితంగా కావాల్సిందే. కరోనా సమయంలో చాలామంది మిరియాల కషాయాన్ని తాగారు. ఎందుకంటే ఇందులో అద్భుత ఔషధ గుణాలు ఉంటాయి. కొంతమంది టీ రుచిని పెంచడానికి కూడా నల్ల మిరియాల పొడిని కలుపుతారు. ఇందులో పైపెరిన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఔషధాల గని. ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, క్రోమియం, విటమిన్ ఎ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నల్ల మిరియాలతో ఈ వ్యాధులని నయం చేయవచ్చు.

మీకు మలబద్దకం సమస్య ఉంటే నల్ల మిరియాలు తీసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒక కప్పు నీటిలో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు కలిపి తాగితే గ్యాస్, మలబద్ధకం సమస్య కొద్ది రోజుల్లోనే నయమవుతుంది. మిరియాలని గోరువెచ్చని నీళ్లతో కలిపి తీసుకుంటే స్టామినా పెరుగుతుంది.. దీంతో పాటు శరీరంలో నీటి కొరత కూడా తొలగిపోతుంది. కొన్నిసార్లు ఎసిడిటీ కారణంగా శరీరంలో ఎప్పుడూ అలసట ఉంటుంది. ఈ అలసటను తొలగించడానికి నల్ల మిరియాలు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి.

మీకు డీహైడ్రేషన్ సమస్య ఉంటే నల్లమిరియాలని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే శరీరంలో నీటి కొరత ఉండదు. ఇది మిమ్మల్ని అలసిపోనివ్వదు. మీ చర్మం పొడిబారదు. చలికాలంలో ఈ రెమెడీని వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. నల్ల మిరియాలు, గోరువెచ్చని నీరు శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గిస్తుంది. దీంతో పాటు కేలరీలను బర్న్ చేయడం ద్వారా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మిరియాల పొడిని వేడి పాలలో కలుపుకొని తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. పరగడుపున తాగితే ఇంకా మంచిది.

Tags:    

Similar News