జీడిపప్పుతో మానసిక ఆరోగ్యం

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం తయారు చేసుకునే వంటల్లో ఉపయోగించే ఆహార పదార్ధాలో మన ఆరోగ్యానికి మార్గాలు. అలాంటి వాటిల్లో జీడిపప్పు ఒకటి... జీడిపప్పు రుచికే కాదు.

Update: 2020-03-04 06:41 GMT

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం తయారు చేసుకునే వంటల్లో ఉపయోగించే ఆహార పదార్ధాలో మన ఆరోగ్యానికి మార్గాలు. అలాంటి వాటిల్లో జీడిపప్పు ఒకటి... జీడిపప్పు రుచికే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండెను పదిలంగా పది కాలా పాటు ఉంచేందుకు.. శరీరానికి కవాల్సిన శక్తిని అందించడంలో జీడిపప్పు ఎంతో ఉపకరిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. జీడిపప్పులో ఉండే పీచు పదార్ధాల వల్ల వీటిని తీసుకున్న వారికి త్వరగా ఆకలి వేయదు. కేవలం జీడిపప్పునే రోజంతా తీసుకున్నా.. అకలి దరిచేరదంటారు ఆరోగ్య నిపుణులు.

జీడిపప్పులో మాంసకృతులు, కొవ్వు పదార్ధాలు, విటమిన్ బి1, బి2, బి3 బి5, బి6, సి, కాల్షియం, ఇరన్, మెగ్నీషియమ్, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవనాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్యానికి హానీ చేసే కొవ్వు పదార్ధం ఇందలో ఉండదు.. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక ఎముల ఆరోగ్యానికి అవసరమయ్యే మెగ్నీషయమ్ స్థాయిలు కూడా ఈ పప్పుల్లో అధికంగా ఉండటం చేత యముకలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి.

అందుకే ప్రతి రోజు గుప్పెడు జీడిపప్పు పలుకులను నానబెట్టి తింటే ఎంతో ఆరోగ్యం. జీడిపప్పులో ఉండే ఐరన్, కాపర్ శరీరంలోని రక్తకణాల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాదు కంటి ఆరోగ్యానికి జీడిపప్పు ఎంతగానో తోడ్పడుతుంది.


Tags:    

Similar News