Health Tips: మీ గోళ్లు పసుపు రంగులోకి మారాయా..జాగ్రత్త..!

Health Tips: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి.

Update: 2022-05-16 14:15 GMT

Health Tips: మీ గోళ్లు పసుపు రంగులోకి మారాయా..జాగ్రత్త..!

Health Tips: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇది గోళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక నివేదిక ప్రకారం మీ గోళ్ల రంగు మారితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద సమస్య రాకముందే దాని నుంచి మీరు బయటపడవచ్చు. వాస్తవానికి గోర్లు పసుపు రంగులోకి మారితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినట్లు అర్థం చేసుకోవాలి. మీ రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని అర్థం. దీని కారణంగా గోర్లు పగుళ్లు ఏర్పడుతాయి. పెరుగుదల ఆగిపోతుంది.

ఇది కాకుండా కొన్నిసార్లు మీరు చేతుల్లో జలదరింపు సమస్యని ఎదుర్కొంటారు. మీరు ఇలాంటి పరిస్థితిని మళ్లీ మళ్లీ అనుభవిస్తే ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇది అధిక కొలెస్ట్రాల్ లక్షణం. నిజానికి ఊబకాయం, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చేతుల్లో జలదరింపు సమస్య ఏర్పడుతుంది. అన్నింటిలో మొదటిది మీరు మీ జీవనశైలిని మార్చుకోవాలి. ఖచ్చితంగా ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను తినవలసి ఉంటుంది. పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది.

గోరు రంగు పసుపుగా మారితే అది ఫంగల్ ఇన్ఫెక్షన్‌ని సూచిస్తుంది. ఇది కాకుండా, థైరాయిడ్, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధిని కూడా సూచిస్తుంది. కొంతమందికి గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతాయి. దీన్నిబట్టి మీ శరీరంలో విటమిన్ బీ, ప్రొటీన్, జింక్ లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు. గోరులో నీలం, నలుపు మచ్చలు ఉంటే శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కొంతమంది గుండె జబ్బులు వచ్చిన తర్వాత కూడా గోళ్ల రంగు మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News