Happy Bhogi 2026: భోగభాగ్యాలనిచ్చే భోగి.. మీ ఆత్మీయులకు ఈ అద్భుతమైన కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండి!
భోగి పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులకు స్పెషల్‌గా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ కోసం కొన్ని అద్భుతమైన భోగి కోట్స్ మరియు మెసేజెస్ ఇక్కడ ఉన్నాయి. మీ వాట్సాప్, ఫేస్‌బుక్ స్టేటస్ కోసం వీటిని వాడేయండి!
తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి మొదలైపోయింది. ముచ్చటగా మూడు రోజుల పాటు జరుపుకునే ఈ సంబరాల్లో మొదటి రోజే ‘భోగి’. పాత జ్ఞాపకాలను, పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేసి.. సరికొత్త ఆశలతో, వెలుగులతో కొత్త జీవితానికి స్వాగతం పలికే పర్వదినం ఇది.
జనవరి 14న జరుపుకోనున్న ఈ భోగి పండుగ సందర్భంగా, మీ స్నేహితులకు, బంధువులకు మరియు శ్రేయోభిలాషులకు పంపడానికి కొన్ని ప్రత్యేకమైన శుభాకాంక్షలు (Wishes & Quotes) ఇక్కడ ఉన్నాయి:
భోగి పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు (Special Bhogi Quotes):
సకల శుభాల కోసం: "భోగి మంటల వెచ్చదనంతో, కోడిపందాల కేరింతలతో, కొత్త అల్లుళ్ల సందడితో మీ ఇంట సకల శుభాలు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు!"
ఆయురారోగ్యాల కోసం: "ఈ భోగి మంటలు మీ జీవితంలోని కష్టాలన్నింటినీ దహించివేసి.. సుఖసంతోషాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు."
చిన్నారుల కోసం: "భోగి పళ్లు, దిష్టి చుక్కలు.. చిన్నారుల నవ్వుల మధ్య ఈ భోగి పండుగ మీ ఇంట్లో ఆనందాలను నింపాలని కోరుకుంటున్నాను."
వెలుగుల కోసం: "భోగ భాగ్యాలనిచ్చే భోగి.. సరదాలను తీసుకొచ్చే సంక్రాంతి.. కమ్మనైన కనుమ.. ఈ పండుగ రోజులు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి. అందరికీ భోగి శుభాకాంక్షలు!"
విజయాల కోసం: "ఈ ఏడాది భోగి పండుగ సందర్భంగా మీరు తలపెట్టిన ప్రతి పని విజయం సాధించాలని కోరుకుంటూ.. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు."
భోగి విశిష్టత: మనం ఏం చేస్తాం?
- భోగి మంటలు: తెల్లవారుజామునే పాత వస్తువులను మంటల్లో వేసి, చలిని తరిమేస్తూ కొత్త వెలుగులకు స్వాగతం పలుకుతాం. ఇది మనసులోని చెడు ఆలోచనలను వదిలేయడానికి సంకేతం.
- భోగి పళ్లు: సాయంత్రం వేళ చిన్నారులకు రేగు పళ్లు, నాణేలు, పూలు కలిపి తలపై పోసి ‘భోగి పళ్లు’ పోస్తారు. దీనివల్ల పిల్లలకు దృష్టి తగలకుండా, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం.
- ముగ్గులు - గొబ్బెమ్మలు: ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, వాటి మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి పూజలు చేస్తారు.