White Hair: జుట్టు తెల్లబడుతుందా.. డైట్‌లో ఇవి చేర్చండి..!

White Hair: ఈ రోజుల్లో చాలామంది తెల్లజుట్టుతో బాధపడుతున్నారు. వాటిని నల్లగా మార్చడానికి రకరకాల రంగులని ఉపయోగిస్తున్నారు.

Update: 2022-05-27 10:45 GMT

White Hair: జుట్టు తెల్లబడుతుందా.. డైట్‌లో ఇవి చేర్చండి..!

White Hair: ఈ రోజుల్లో చాలామంది తెల్లజుట్టుతో బాధపడుతున్నారు. వాటిని నల్లగా మార్చడానికి రకరకాల రంగులని ఉపయోగిస్తున్నారు. అసలు జుట్టు ఎందుకు తెల్లగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి పోషకాహార లోపం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. ఈ విషయం తెలియక చాలామంది జుట్టు తెల్లగా మారుతుందని ఒత్తిడికి లోనవుతారు. రకరకాల రంగులని ఆశ్రయిస్తారు కానీ ఫుడ్‌ గురించి పట్టించుకోరు. వాస్తవానికి పోషకాహారం తినడం వల్ల జుట్టు తెల్లగా మారడం ఆగిపోతుంది. డైట్‌లో కొన్ని ఆహారాలని చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. పాలకూర తప్పక తినాలి

జుట్టు నల్లగా మారాలంటే ఆకుకూరలు తప్పకుండా తినాలి. అందులో బచ్చలికూర చాలా ముఖ్యమైనది. దీనిని తింటే జుట్టు నెరవడం ఆగిపోతుంది. మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. నిజానికి బచ్చలికూర ఒక అద్భుతమైన మొక్కల ఆధారిత మూలం. ఇందులో ఫోలేట్, ఐరన్, విటమిన్లు A, C ఇంకా చాలా పోషకాలు ఉంటాయి.

2. ప్రతిరోజు గుడ్డు తినాలి

ఇది కాకుండా శరీరానికి చాలా ప్రోటీన్ అవసరం. ఈ పరిస్థితిలో ప్రతిరోజు గుడ్డు తినడం అలవాటు చేసుకోవాలి. గుడ్డుని ఆహారంలో కచ్చితంగా చేర్చుకోవాలి. ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఒకవేళ మీకు గుడ్లు నచ్చకపోతే ఆహారంలో సోయాబీన్‌ను చేర్చుకోవచ్చు. దీని వల్ల మీరు అధిక ప్రయోజనం పొందుతారు. అలాగే ఉసిరి, చిక్‌పీస్‌, పప్పులు తినడం మొదలుపెడితే జుట్టు తెల్లబడదు. వెంటనే డైట్‌లో ఈ ఆహారాలని చేర్చుకుంటే మంచిది.

Tags:    

Similar News