Google 5G phone 'Pixel 4a' Specifications: గూగుల్ నుంచి తొలి 5జీ స్మార్ట్ ఫోన్‌.. అది కూడా బ‌డ్జెట్ లోనే..

Google 5G phone 'Pixel 4a' Specifications: ప్రముఖ సెర్చ్ ఇంజిన్, టెక్ దిగ్గజం గూగుల్ తొలిసారి 5జీ మొబైల్ ను విడుద‌ల చేసింది. పిక్సల్ సిరీస్‌లో 'పిక్సల్ 4ఎ' పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

Update: 2020-08-04 19:02 GMT
google phone

Google 5G phone 'Pixel 4a' Specifications: ప్రముఖ సెర్చ్ ఇంజిన్, టెక్ దిగ్గజం గూగుల్ తొలిసారి 5జీ మొబైల్ ను విడుద‌ల చేసింది. పిక్సల్ సిరీస్‌లో 'పిక్సల్ 4ఎ' పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సరికొత్త ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేందుకు సోమ‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. అంద‌రికీ అందుబాటులో ఉండేలా మిడ్ రేంజ్ లో ఈ ఫోన్ ను ముందుకు తీసుక‌వ‌చ్చింది. అలాగే ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ ఎస్ ఈ2020, వన్ ప్లస్ నార్డ్ పోటీ పడనుంది.. గూగుల్ పిక్సల్ 4ఎ స్మార్ట్‌ఫోన్ కేవలం బ్లాక కలర్ ఆప్షన్‌లో మాత్రమే విడుదలైంది. దీని ధరను దాదాపుగా అమెరికాలో 349 డాలర్లుగా(రూ.26,245) నిర్ణయించారు. అయితే ప్రస్తుతానికి ఈ మొబైల్స్ అమెరికా, కెనడా, యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, తైవాన్, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే లభ్యం కానుంది. భారత్, సింగపూర్ మార్కెట్లలోకి అక్టోబర్ నెలలో ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త విష‌యానికి వ‌స్తే.. 5.8 అంగుళాల‌ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఓలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. టైటాన్ ఎం సెక్యూరిటీ మాడ్యూల్ (Titan M Security Module)కు సపోర్టుతో పాటు ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, నౌ ప్లేయింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ద్వారా అందిస్తున్న కెమెరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తాయి. అలాగే ఈ ఫోన్‌ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి అధునాతన ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

గూగుల్ పిక్సల్ 4ఎ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :

* 5.81 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ డిస్ ప్లే,

* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్,

* 6జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,

* 12.2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

* 3140 ఎంఏహెచ్ బ్యాటరీ.  

Tags:    

Similar News