Samsung Galaxy M31s Features: శాంసంగ్ నుంచి.. సూప‌ర్ బ్యాట‌రీతో.. అదిరిపోయే కెమెరా ప్యూచ‌ర్‌తో.. బ‌డ్జెట్ ఫోన్!

Samsung Galaxy M31s Features: శాంసంగ్ నుంచి.. సూప‌ర్ బ్యాట‌రీతో.. అదిరిపోయే కెమెరా ప్యూచ‌ర్‌తో.. బ‌డ్జెట్ ఫోన్!
x
Samsung Galaxy M31s Features
Highlights

Samsung Galaxy M31s Features: భారత్ స్మార్ట్‌ఫోన్ ‌ప్ర‌పంచంలోకి అద్భుతమైన ఫీచర్లతో ఎప్పటికప్పుడు స‌రికొత్త‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల అవుతుంటున్నాయి.

Samsung Galaxy M31s Features: భారత స్మార్ట్‌ఫోన్ ‌ప్ర‌పంచంలోకి అద్భుతమైన ఫీచర్లతో ఎప్పటికప్పుడు స‌రికొత్త‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల అవుతుంటున్నాయి. మిగిలిన స్మార్ట్ ఫోన్‌ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వ‌డానికి తాజాగా సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. సింగిల్‌ టేక్‌ కెమెరా మోడ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పవచ్చు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ లాంటి హంగుల‌తో అది కూడా త‌క్కువ బ‌డ్జెట్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అదే శాంసంగ్ `గెలాక్సీ ఎం31ఎస్` స్మార్ట్‌ఫోన్‌. జూలై 30న భార‌త మార్కెట్‌లోకి విడుద‌లైంది. ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో మార్కెట్లోకి అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో ముఖ్యంగా 64మెగాపిక్సెల్ ఇంటెల్లీ క్యామ్‌లో సింగిల్ టేక్, ఫ్రంట్ కెమెరాలోనూ హెచ్ డీ ఆర్ మోడ్ లో ఫోట్స్, వీడియోస్ తీసుకోనే అద్భుత‌మైన ప్యూచ‌ర్ కెమెరా ల‌వ‌ర్స్‌ను క‌ట్టిప‌డేస్తుంది. అలాగే బయోమెట్రిక్‌ ఫెసిలిటీ కోసం సైడ్‌-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మ‌రో ప్ర‌త్యేక‌త‌. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు తొలిసారి సోనీ సెన్సార్ తో 32మెగాపిక్సెల్ కెమెరా మ‌రో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ఈ స్మార్ట్ డ్యూయల్‌ సిమ్‌ ఫెసిలిటీ కూడా ఉంది. ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. అలాగే 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ గెలాక్సీ ఎం31ఎస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. మిరేజ్ బ్లూ, మిరేజ్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది

సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ లో అదిరిపోయే ఫీచర్లు ఇవే :

- 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ 407 పీపీఐ పంచ్‌ హోల్‌ డిప్లే

- ఇన్ఫినిటీ-0 డిస్ ప్లే ఎక్సీనోస్‌ 9611 ప్రాసెసర్

- 6జీబీ+ 128జీబీ ర్యామ్

- 8జీబీ+ 256 జీబీ స్టోరేజీ

- ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్,దీంతోపాటు 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ (64MP (F/1.8)+12(F/2.2)UW+5MP (F/2.4)

- ముందువైపు 32మెగాపిక్సెల్ కెమెరా (డెప్త్+5 (F/2.4) మాక్రో - ఫ్రంట్ 32MP (F/2.2) కెమెరా)

- 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ,

- 25W టైప్-C ఛార్జింగ్

- ఆండ్రాయిడ్‌ 10ఒఎస్

శాంసంగ్‌ గెలాక్సీ ఎం31ఎస్ ధర విషయానికి వస్తే.. 6జీబీ+128జీబీ- రూ.19,499గా, 8జీబీ+128జీబీ- రూ.21,499గా నిర్ణయించింది. అమెజాన్‌ ఇండియా, శాంసంగ్‌ డాట్‌కామ్‌ల ద్వారా ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories