Ghee: ఈ సమస్యలుంటే నెయ్యి జోలికి అస్సలు పోకండి..!

Ghee: నెయ్యి రుచికి అలవాటు పడితే మానడం చాలా కష్టం. ఇది కొంతమందికి చాలా ఆరోగ్య సమస్యలని తెచ్చిపెడుతుంది.

Update: 2022-08-20 13:00 GMT

Ghee: ఈ సమస్యలుంటే నెయ్యి జోలికి అస్సలు పోకండి..!

Ghee: నెయ్యి రుచికి అలవాటు పడితే మానడం చాలా కష్టం. ఇది కొంతమందికి చాలా ఆరోగ్య సమస్యలని తెచ్చిపెడుతుంది. కానీ మరికొంత మందికి చాలా మంచి చేకూరుస్తుంది. నెయ్యి తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్నే అప్రయోజనాలు కూడా ఉన్నాయి. నెయ్యిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దేశీయ ఆవు నెయ్యి చాలా స్వచ్చమైనది రుచికరమైనది. దీని వల్ల ఆహార పదార్థాలకు అదనపు రుచి వస్తుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు నెయ్యికి దూరంగా ఉండాల్సిందే.. ఎందుకో తెలుసుకుందాం.

శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వ ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఊబకాయులు నెయ్యి జోలికి పోకూడదు. ఎందుకంటే ఇందులో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మరింత కొవ్వు శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంది. అలాగే బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు నెయ్యి జోలికి అసలు వెళ్లకూడదు. పీసీఓడి సమస్యతో సతమతమవుతున్న మహిళలు కూడా నెయ్యి తినకూడదు. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో దాదాపు 112 కేలరీలు ఉంటాయని గుర్తుంచుకోండి.

కడుపుకి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే నెయ్యి తీసుకోకూడదు. గుండె, కిడ్నీ జబ్బులతో బాధపడే వాళ్ళు ఆవు నెయ్యి ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును పెంచే సామర్థ్యం కలిగి ఉంటాయి. కడుపు ఉబ్బరంగా ఉన్నపుడు, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్ళు నెయ్యికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వృద్దులు గుండెపోటుకి గురికాకుండా ఉండాలంటే నెయ్యికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Tags:    

Similar News