Ghee Benefits: మలబద్దక సమస్యకి నెయ్యి దివ్యౌషధం.. ఎలా ఉపయోగించాలంటే..?

Ghee Benefits: ఆయుర్వేదంలో నెయ్యి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకి పరిష్కారం చూపుతుంది.

Update: 2023-05-31 02:30 GMT

Ghee Benefits: మలబద్దక సమస్యకి నెయ్యి దివ్యౌషధం.. ఎలా ఉపయోగించాలంటే..?

Ghee Benefits: ఆయుర్వేదంలో నెయ్యి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకి పరిష్కారం చూపుతుంది. చాలామంది ఫైబర్‌ లేని ఆహారం తినడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారు. అందుకే పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ఎక్కువ వేయించిన, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మలబద్ధకానికి గురికావాల్సి ఉంటుంది. ఈ సమస్యని నెయ్యి ఉపయోగించి సులభంగా పరిష్కరించవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో మలబద్ధకం వల్ల పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి అతి పెద్ద కారణం చెడు ఆహారం తినడమే. ఆహారంలో పోషకాహారం లోపించినప్పుడు శారీరక సమస్యలు పెరుగుతాయి. మలబద్ధకం అనేది కడుపుకు సంబంధించిన సమస్య. దీని కారణంగా నిద్ర, జుట్టు రాలడం, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతాయి. అందుకే నెయ్యిని ఈ విధంగా ఉపయోగించాలి.

మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటే నెయ్యిని వేడి పాలలో కలుపుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. నిజానికి నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి విముక్తి పొందడంలో పనిచేస్తుంది. మరోవైపు ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. దీంతో పాటు పేగులలో మలం కదలిక సులభం అవుతుంది. కడుపునొప్పి, వాపు, మంట వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

పాలు, నెయ్యి

వేసవిలో మలబద్ధకం సమస్య ఉంటే రాత్రి పడుకునే ముందు నెయ్యి కలిపిన పాలను తాగడం చేయాలి. దీంతో మీ పొట్ట ప్రతిరోజూ ఉదయాన్నే క్లియర్ అవుతుంది. ఇది మీ జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అంతే కాదు దీనివల్ల పేగులు శుభ్రపడతాయి. మలబద్ధకం సమస్య నయం కావాలంటే తరచుగా ఇలా చేస్తు ఉండాలి. మంచి ఫలితాలు ఉంటాయి.

Tags:    

Similar News