New Bike Launches: బడ్జెట్ రెడీ చేస్కోండి.. ఈ నెల మార్కెట్లోకి అదిరిపోయే బైక్స్ వచ్చేస్తున్నాయ్
New Bike Launches: భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో ఈ నెల కొత్త లాంచ్‌ల సందడి మొదలవబోతోంది. స్పోర్టీ బైక్‌లు, రోజువారీ అవసరాలకు కమ్యూటర్లు లేదా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కొత్తదనం కోసం చూస్తున్న వారికైనా ఈ ఆగస్టు నెల పండుగే.
New Bike Launches: బడ్జెట్ రెడీ చేస్కోండి.. ఈ నెల మార్కెట్లోకి అదిరిపోయే బైక్స్ వచ్చేస్తున్నాయ్
New Bike Launches: భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో ఈ నెల కొత్త లాంచ్‌ల సందడి మొదలవబోతోంది. స్పోర్టీ బైక్‌లు, రోజువారీ అవసరాలకు కమ్యూటర్లు లేదా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కొత్తదనం కోసం చూస్తున్న వారికైనా ఈ ఆగస్టు నెల పండుగే. ట్రయంఫ్, హోండా, టీవీఎస్ వంటి పెద్ద బ్రాండ్లు తమ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టబోతున్నాయి. ఆగస్టు 2025లో రాబోతున్న 5 ముఖ్యమైన బైక్‌లు, స్కూటర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. ట్రయంఫ్ థ్రక్స్టన్ 400
ట్రయంఫ్ తన స్టైలిష్ కేఫ్-రేసర్ థ్రక్స్టన్ 400ను ఆగస్టు 6న లాంచ్ చేయబోతోంది. ఈ బైక్ ధర సుమారు రూ.2.6 లక్షల నుంచి రూ.2.9 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఈ బైక్ యువ రైడర్లను ఆకర్షించేలా స్టైలిష్ డిజైన్‌తో రాబోతోంది.
2. హోండా సీబీ125 హార్నెట్, షైన్ 100 డీఎక్స్
హోండా ఈ ఆగస్టులో రెండు కొత్త మోడళ్లను లాంచ్ చేయబోతోంది. అవి సీబీ125 హార్నెట్, షైన్ 100 డీఎక్స్. ఈ బైక్‌ల బుకింగ్‌లు ఆగస్టు 1న మొదలయ్యాయి. హార్నెట్ యువ రైడర్‌ల కోసం స్పోర్టీ డిజైన్, మంచి పర్ఫార్మెన్స్‌తో వస్తుండగా, షైన్ 100 డీఎక్స్ రోజువారీ ప్రయాణాలకు ఒక మంచి ఆప్షన్ కానుంది.
3. ఒబెన్ రార్ ఈజెడ్
ఒబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ తమ కొత్త తరం రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఆగస్టు 5న లాంచ్ చేయనుంది. దీని అమ్మకాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఇ-బైక్ ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.
4. టీవీఎస్ అపాచే ఆర్టీఎక్స్ 300
టీవీఎస్ తన మొదటి అడ్వెంచర్ బైక్ అపాచే ఆర్టీఎక్స్ 300ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో RT‑XD4 ఇంజిన్ ఉంటుంది. ఇది 35bhp పవర్, 28.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ అంచనా ధర రూ.2.50 లక్షలు ఉండవచ్చు. ఈ బైక్ అడ్వెంచర్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
5. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 450
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కూడా ఆగస్టులో స్క్రామ్ 450 లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది హిమాలయన్ 450 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. అడ్వెంచర్, స్ట్రీట్ రైడింగ్ రెండింటికీ ఇది ఉపయోగపడుతుంది. దీని ధర కూడా సుమారు రూ.2.5 లక్షల నుండి రూ.2.8 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.