Health Tips: గ్యాస్‌, అసిడిటీ ఇబ్బంది పెడుతుందా.. తక్షణ విముక్తి కోసం ఇలా చేయండి..!

Health Tips: ఈ రోజుల్లో అజీర్ణం అనేది సాధారణ సమస్యగా మారింది.

Update: 2022-11-13 12:26 GMT

Health Tips: గ్యాస్‌, అసిడిటీ ఇబ్బంది పెడుతుందా.. తక్షణ విముక్తి కోసం ఇలా చేయండి..!

Health Tips: ఈ రోజుల్లో అజీర్ణం అనేది సాధారణ సమస్యగా మారింది. చాలా సార్లు వేయించిన లేదా కారంగా ఏదైనా తిన్న తర్వాత 2-3 రోజులు అజీర్ణం లేదా గ్యాస్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల ఏ పనిమీద ధ్యాస పెట్టలేము. కడుపు సమస్యలు మిమ్మల్ని ముందుకు సాగనివ్వవు. అయితే అజీర్ణం, గ్యాస్ నుంచి బయటపడటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. కేవలం 5 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా మీరు ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

తులసి నీరు

తులసి ఒక పవిత్రమైన మొక్క మాత్రమే కాదు ఇది అనేక అద్భుతమైన ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. అజీర్ణం ఉంటే ఒక గ్లాసు నీటిలో 4-5 తులసి ఆకులను వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆకులని తీసివేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దికొద్దిగా తాగాలి. ఇది మీ కడుపు నొప్పిని నయం చేస్తుంది.

లెమన్‌ వాటర్‌

కడుపు నొప్పిని తొలగించడానికి లెమన్ వాటర్ గొప్ప ఔషధం. కడుపులో వేడి లేదా అజీర్ణం ఉంటే ఒక గ్లాసు నీరు తీసుకుని అందులో నిమ్మరసం, ఉప్పు కలపాలి. తర్వాత ఆ నీటిని తాగాలి. ఈ రెమెడీని రోజుకు 2-3 సార్లు చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అవసరమైన దానికంటే ఎక్కువ నిమ్మకాయ నీరు తాగకూడదని గుర్తుంచుకోండి. లేదంటే దంతాల బయటి పొర దెబ్బతింటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

మీ ఇంట్లో ఆపిల్ వెనిగర్ ఉంటే అజీర్ణం, గ్యాస్ సమస్యను తొలగించడానికి ఉపయోగించవచ్చు. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. తర్వాత ఆ ద్రావణాన్ని తాగాలి. దీనివల్ల పొట్ట చల్లబడి మంట తగ్గుతుంది.

అల్లం

చలికాలంలో అల్లాన్ని టీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అల్లంలో అనేక ఆయుర్వేద గుణాలు ఉంటాయి. కడుపు సమస్యలు లేదా గ్యాస్ ఏర్పడటం వల్ల ఇబ్బంది పడుతుంటే ఒక కప్పు నీటిలో కొద్దిగా అల్లం వేసి మరిగించండి. తర్వాత ఆ నీటిని వడపోసి తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tags:    

Similar News