Food Poison: వర్షాకాలంలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు – కారణాలు, నివారణ చిట్కాలు
వర్షాకాలం మొదలవడంతో ఆహార సంబంధిత అనారోగ్యాలు, ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతున్నాయి. వాతావరణంలో తేమ, ఉష్ణోగ్రత మార్పులు బ్యాక్టీరియా, వైరస్‌లు పెరిగేందుకు అనుకూలం కావడంతో ఆహారం త్వరగా పాడైపోతుంది.

వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు ఎక్కువగా వస్తుంది?
సూక్ష్మజీవుల పెరుగుదల: అధిక తేమ కారణంగా E. coli, Salmonella, ఫంగస్, వైరస్‌లు వేగంగా వ్యాపిస్తాయి.
నీటి కాలుష్యం: వరదల వల్ల నీటి వనరులు కలుషితమవుతాయి. కలుషిత నీటితో వండిన ఆహారం వల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
స్ట్రీట్ ఫుడ్ ప్రమాదం: వీధి ఆహారం పరిశుభ్రత లేకపోవడం, కలుషిత నీటిని వాడడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ముప్పు ఎక్కువ.
తప్పు నిల్వ విధానం: తేమ కారణంగా పండ్లు, కూరగాయలు త్వరగా కుళ్లిపోతాయి. ఫ్రిజ్‌లో ఉన్న ఆహారం కూడా బ్యాక్టీరియా బారిన పడే అవకాశం ఉంది.
ఫుడ్ పాయిజనింగ్ నివారణ చిట్కాలు
తాజా ఆహారం తినండి: బయట ఆహారం మానేయండి. పండ్లు, కూరగాయలు ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటితో కడగాలి.
శుభ్రత పాటించండి: వంటకు ముందు, తినే ముందు చేతులు కడుక్కోవాలి. వంటగది, పాత్రలను పరిశుభ్రంగా ఉంచాలి.
మరిగించిన నీరు వాడండి: తాగే నీటిని మరిగించి లేదా ఫిల్టర్ చేసి వాడటం మంచిది. బయటకు వెళ్లినప్పుడు స్వంత వాటర్ బాటిల్ తీసుకెళ్లండి.
ఆహారం బాగా ఉడికించండి: మాంసం, చేపలు పూర్తిగా ఉడికించి తినాలి.
సరైన నిల్వ: మిగిలిన ఆహారాన్ని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసి తినండి.
పండ్ల తొక్క తీసి తినండి: బయట తరిగిన పండ్లు, సలాడ్లు తినకండి.
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పరిశుభ్రత, ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.