Children Health Tips: ఈ ఆహార పదార్థాలు పిల్లల శరీరాన్ని బలహీనపరుస్తాయి..!

Children Health Tips: తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కానీ, కొన్నిసార్లు తెలిసీ తెలియకుండా పిల్లలకి హానికరమైన ఆహారాలు ఇస్తుంటారు. అయితే, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Update: 2025-06-16 04:30 GMT

Children Health Tips: ఈ ఆహార పదార్థాలు పిల్లల శరీరాన్ని బలహీనపరుస్తాయి..!

Children Health Tips: తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కానీ, కొన్నిసార్లు తెలిసీ తెలియకుండా పిల్లలకి హానికరమైన ఆహారాలు ఇస్తుంటారు. అయితే, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఆహారాలను పిల్లలకి ఇవ్వడం మంచిది కాదని సూచిస్తున్నారు.

బ్రెడ్ & జామ్

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఇష్టపడతారని రోజూ బ్రెడ్, జామ్ ఇస్తుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. జామ్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అలవాటు చేయొద్దు. మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకుంటే మంచిది.

పాలలో హెల్త్ డ్రింక్ పౌడర్లు

పిల్లల ఆరోగ్యానికి పాలలో హెల్త్ డ్రింక్ పౌడర్లు కలపడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ప్రొటీన్ పౌడర్లలో చాలా చక్కెర, రుచి పెంచే పదార్థాలు, రసాయనాలు కలిగి ఉంటాయి. వీటిని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, పిల్లలకు స్వచ్ఛమైన పాలు ఇవ్వడం మంచిది.

ఇన్‌స్టంట్ నూడుల్స్

మ్యాగీ, యిప్పీ వంటివి వీటిలో పోషక విలువలు ఏమీ ఉండవు. రసాయనాలతో తయారవుతాయి. పిల్లలకు తరచూ ఇస్తే జీర్ణ సమస్యలు, శరీర బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తాయి. కాబట్టి, ఇంట్లోనే పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వడం మంచిది.

క్రీమ్ బిస్కెట్లు

క్రీమ్ బిస్కెట్లు పిల్లల ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాయి. ఎందుకంటే, వీటిలో ఎక్కువ చక్కెర ఉంటుంది. కాబట్టి, పిల్లలకు ఇంటి వంటలు అలవాటు చేయండి. చపాతీ, పండ్ల వంటివి ఇవ్వండి.

చాక్లెట్ పాలు / చోకోస్

చాక్లెట్ కలిపిన పాలు ఆరోగ్యంగా ఉంటాయని అనుకుంటారు కానీ వీటిలో అధిక చక్కెర, కృత్రిమ రుచులు ఉంటాయి. ఖాళీ కడుపుతో పిల్లలకు వీటిని ఇస్తే రక్తంలోని చక్కెర స్థాయి వెంటనే పెరుగుతుంది.ఇది పలు సమస్యలకు దారి తీస్తుంది.

ఐస్ క్రీమ్

చాలామంది ఐస్ క్రీమ్‌లో పాలు ఉంటాయని అనుకుంటారు. కానీ బహుశా ఇవి కృత్రిమ పదార్థాలతో తయారవుతాయి. ఇవి తినడం వల్ల జలుబు, అలాగే జీర్ణ సమస్యలు వస్తాయి. పిల్లలకు కాకుండా పెద్దలకు కూడా మితంగా ఇవ్వాలి. ఇంకా ప్యాక్ చేసిన జ్యూస్, కూల్ డ్రింక్స్ కూడా పిల్లలకు ఇవ్వడం మంచిది కాదు. సహజమైన పండ్ల రసం ఇంట్లో చేసిందే ఇవ్వడం ఆరోగ్యానికి మంచిది.

Tags:    

Similar News