Bad Breath: నోటి నుంచి దుర్వాసన రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!

Bad Breath: నోటి దుర్వాసన మీ మానసిక స్థితిని పాడుచేయడమే కాకుండా పక్కన కూర్చొనే వారిని కూడా అసౌకర్యానికి గురి చేస్తుంది.

Update: 2022-04-20 14:14 GMT

Representational Image

Bad Breath: నోటి దుర్వాసన మీ మానసిక స్థితిని పాడుచేయడమే కాకుండా పక్కన కూర్చొనే వారిని కూడా అసౌకర్యానికి గురి చేస్తుంది. ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే భాగస్వామి నుంచి స్నేహితుల వరకు అందరూ దగ్గరగా కూర్చోవడం మానేస్తారు. నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉండవచ్చు. చెడ్డ ఆహారం, కూల్‌డ్రింక్స్‌, కడుపు సంబంధిత వ్యాధుల వల్ల నోటి దుర్వాసన వస్తుంది. అంతే కాకుండా దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధికి మందులు వాడుతున్న వారికి నోటి దుర్వాసన సమస్య ఉంటుంది. మీ సమస్యకు కారణం ఏమైనప్పటికీ కొన్ని చిట్కాలు పాటిస్తే దీని నుంచి బయటపడవచ్చు.

1. నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం

నోటి ఆరోగ్యం గురించి అవగాహన ఉన్నవారు ఖచ్చితంగా రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటారు. కానీ చాలా మంది పళ్లు తోముకోవడం, నాలుకను శుభ్రం చేసుకోవడం చేయరు. ఈ పొరపాటు వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

2. తీపి పదార్థాలు ఎక్కువగా తినడం

టీ-కాఫీ, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే చక్కెర కారణంగా మీ నోటిలో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది నోటి దుర్వాసనకు కారణమవుతుంది. ఇది మానసిక స్థితిని పాడు చేస్తుంది.

3. లవంగాలు తింటే బెస్ట్

ఆహారం తిన్న తర్వాత, రాత్రి నిద్రపోయే ముందు మీకు నచ్చినప్పుడల్లా నోటిలో ఒక లవంగాన్ని ఉంచి, మిఠాయిలా నెమ్మదిగా చప్పరిస్తూ ఉండాలి. ఇది చాలా అద్భుతమైన చిట్కా. ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది. దంతాలను ఆరోగ్యంగా చేస్తుంది.

4. నీరు ఎక్కువగా తాగాలి

నోటి దుర్వాసనను నివారించడానికి ఎక్కువగా నీరు తాగాలి. ఎందుకంటే రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగకపోతే నోటి దుర్వాసన రావడం సహజమే. కాబట్టి తగినంత నీరు తాగాలి.

5. పొట్ట క్లీన్‌గా ఉండాలి

మలబద్ధకం సమస్య ఉన్నవారికి నోటి దుర్వాసన సమస్య కూడా ఉంటుంది. అందుకే మీ పొట్టను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. మలబద్ధకం సమస్య ఉంటే ఉసిరి పొడి, త్రిఫల, మొదలైన వాటిని తీసుకుని కడుపుని పూర్తిగా శుభ్రం చేసుకోండి.

Tags:    

Similar News