Expired Medicines: ఎక్స్ పైర్ అయ్యాయని మందులను బయట పడేస్తున్నారా? అయితే జర జాగ్రత్త
Expired Medicines: డాక్టర్ సలహా మేరకో లేక సొంత వైద్యానికో మందుల షాపుల నుండి మందులను కొనుగోలు ఇంటికి తీసుకొస్తాం. అయితే ఇలా ఇంటికి తీసుకొచ్చి నూటి నూరు శాతం మందులు అన్నీ వాడే వాళ్లు చాలా తక్కువ.
Expired Medicines: ఎక్స్ పైర్ అయ్యాయని మందులను బయట పడేస్తున్నారా? అయితే జర జాగ్రత్త
Expired Medicines: శరీరంలో ఎటువంటి రోగం వచ్చినా దానికి పరిష్కారం మందులే. మందులు లేనిదే జీవితం లేదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రిపడుకునే వరకు, తలనొప్పి నుంచి జ్వరం, దగ్గు, అన్ని రకాల నొప్పులకు మందులు ఉండాల్సిందే. ఇంకొందమంది అయితే ఏదో ఫలహారం తింటున్నట్టు మందులను చేతిలో వేసుకుని తింటుంటారు కూడా. అంతలా మందులు జీవనంలో కలిసిపోయేయి. అయితే మందులు ఎక్స్ పైర్ అయిపోయాయని చెత్త బుట్టలో పడేస్తే.. అవి ఎవరైనా తింటే ప్రాణాలకే ముప్పని ఔషధ నియంత్రణ సంస్థ చెబుతోంది. అయితే ఇందులో ఎలాంటి మందులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డాక్టర్ సలహా మేరకో లేక సొంత వైద్యానికో మందుల షాపుల నుండి మందులను కొనుగోలు ఇంటికి తీసుకొస్తాం. అయితే ఇలా ఇంటికి తీసుకొచ్చి నూటి నూరు శాతం మందులు అన్నీ వాడే వాళ్లు చాలా తక్కువ. పది రోజులు వాడాల్సిన మందులు నాలుగు, ఐదు రోజులు వాడి మానేసేవారు, మూడు రోజులు వాడాల్సిన వాళ్లు ఒక్కరోజు వేసుకుని మానేసేవారు చాలామంది ఉంటారు. దీనివల్ల మందులు ఇంట్లో అలా పేరుకుపోతుంటాయి. ఇలా నిల్వ ఉండిపోయిన మందులను అసలు వాడకూడదు. కనీసం చెత్తలో పాడేయ కూడదని ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది.
కాలం చెల్లిన కొన్ని మందులను చెత్తబుట్టలో పారేయడం వల్ల అసలు ముప్పు మొదలవుతుంది. ముఖ్యంగా నొప్పి, ఆందోళన మొదలైన సమస్యలకు వాడే ట్రమడాల్, టాపెంటడాల్, డైజిపామ్, ఆక్సికోడోన్, ఫెంటానిల్ వంటి 17 రకాల మందులు ఎంతో ప్రమాదకరమైనవని ఔషధ నియంత్రణ సంస్థ చెబుతోంది. ఎక్స్ పైరీ అయిన మందులను చెత్త బుట్టలో పడేస్తే, వాటిని ఎవరైనా అంటే చెత్తను ఏరే పిల్లలు, పెద్దలు, జంతువులు..ఇలా ఎవరైనా వీటిని తిన్నా చాలా ప్రమాదమని అని సంస్థ చెబుతోంది. ఒక్కొక్కసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తోంది.
అంతేకాదు చెత్త బుట్టలో దొరికిన మందులను కొందరు అక్రమార్కులు తీసుకుని, దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్లు ఆ మందులను తిరిగి మళ్లీ మార్కెట్లోకి అమ్ముతున్నారు. ఇలాంటి మందులను ఎవరైనా తింటే వెంటనే ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తబుట్టలో మందులు వేయొద్దని అధికారులు చెబుతున్నారు.
అయితే ఇలాంటి మందులను చెత్త బుట్టలో వేయకుండా ఏం చేయాలి? అంటే వాటిని టాయిలెట్‌లో వేసి ఫ్లష్ చేయాలి. లేదంటే మట్టిలో కప్పి పుచ్చాలి. ఇలా వాటిని శాశ్వతంగా నాశనం చేయడం వల్ల మళ్లీ వాటిని ఎవరూ తినరు అదేవిధంగా వేరే రకంగా కూడా వాడరు అని ఔషధ నియంత్రణ సంస్థ చెబుతోంది.