Midday Sleeping: మధ్యాహ్నం కునుకు మంచిదేనట.. నిపుణులు ఇవి చెబుతున్నారు..!

Midday Sleeping: నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్రపోకపోతే మరుసటి రోజు ఏ పనిమీద ధ్యాసపెట్టలేం.

Update: 2024-03-02 09:33 GMT

Midday Sleeping: మధ్యాహ్నం కునుకు మంచిదేనట.. నిపుణులు ఇవి చెబుతున్నారు..!

Midday Sleeping: నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్రపోకపోతే మరుసటి రోజు ఏ పనిమీద ధ్యాసపెట్టలేం. నిద్ర ఒక మనిషికి రీ ఎనర్జీని అందిస్తుంది. అయితే చాలామంది రాత్రిపూట మాత్రమే నిద్రపోతారు. మధ్యాహ్నం నిద్ర మంచిది కాదు అంటారు. ఇంకొంతమంది మధ్యాహ్నం నిద్రవచ్చిన పోరు ఎందుకంటే రాత్రి మళ్లీ నిద్రరాదని వారి నమ్మకం. అయితే మధ్యాహ్నం పూట నిద్రపోకపోవడం మంచిదే కానీ చిన్న కునుకు తీయడం తప్పులేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మధ్యాహ్నం నిద్ర ఎందుకు మంచిది?

మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నవారు, ఇప్పటికే గుండె సమస్యలకు సంబంధించిన చికిత్సలు తీసుకుంటున్న వారికి మరింత మేలు జరుగుతుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓఎస్‌, థైరాయిడ్‌, మధుమేహం, స్థూలకాయం.. వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వారు మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల హార్మోన్లు సమతులమై.. తద్వారా ఆయా సమస్యలు అదుపులో ఉంటాయి.

ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కడుపుబ్బరం, మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు.. వంటివి సహజం. అయితే వీటికి చెక్‌ పెట్టి జీర్ణశక్తిని పెంచడంలో మధ్యాహ్నం నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. విశ్రాంతి లేకుండా పని చేయడం, మధ్యాహ్నం నిద్రను త్యాగం చేయడం వల్ల మనకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతాం. దీని ప్రభావం అందంపై పడుతుంది. మొటిమలు, చుండ్రుకు కారణమవుతుంది. కాబట్టి భోజనం తర్వాత కాసేపు కునుకు తీయడం వల్ల ఒత్తిడి దరిచేరకుండా సౌందర్యాన్నీ కాపాడుకోవచ్చు.

మధ్యాహ్నం నిద్ర వల్ల రాత్రి నిద్రకు ఎలాంటి అంతరాయం కలగదు. పైగా ఇది రాత్రి నిద్రను ప్రేరేపిస్తుంది. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారు పదే పదే ప్రయాణాల్లో అలసిపోయిన వారు పండగలు-ఫంక్షన్లతో తీరిక లేకుండా గడిపే వారికి ఈ కునుకు వారికి రిలాక్స్‌ను అందిస్తుంది. కొంతమంది వ్యాయామాలతో అలసిపోతుంటారు.. మరికొందరు ఆరోగ్య సమస్యలతో నీరసిస్తుంటారు. ఇలాంటి వారు మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల శరీరం పునరుత్తేజితమవుతుంది.

Tags:    

Similar News