Health Tips: ఈ ఆహారాలు ఎక్కువగా తింటే రోగాల బారిన పడక తప్పదు..!

Health Tips: ఈ ఆహారాలు ఎక్కువగా తింటే రోగాల బారిన పడక తప్పదు..!

Update: 2022-07-14 14:30 GMT

Health Tips: నేటికాలంలో చాలామంది చిన్న వయసులోనే గుండెపోటు, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం వారు తినే ఆహారమే. మీరు ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించాలనుకుంటే కొన్ని ఆహారాలకి దూరంగా ఉండటం మంచిది. లేదా వాటిని తినడం చాలా వరకు తగ్గించాలి. అలాంటి బ్యాడ్‌ ఫుడ్స్‌ కొన్నింటి గురించి తెలుసుకుందాం.

1. ఉప్పు

ఉప్పు శరీరానికి అవసరమైన అయోడిన్‌ను కలిగి ఉంటుంది. కానీ ఎక్కువ తినడం చాలా ప్రమాదకరం. ఉప్పు తింటే బీపీ పెరిగి కిడ్నీపై చెడు ప్రభావం ఉంటుంది. వాస్తవానికి మూత్రపిండాల ప్రధాన విధి రక్తాన్ని శుద్ధి చేయడం. అయితే ఉప్పు వాటి విధులకి ఆటంకం కలిగిస్తుంది.

2. చక్కెర

మీరు వర్కవుట్‌లు చేయకపోతే ఇంట్లో చక్కెరను తినడం మానేయండి. ఒకవేళ తినాలనిపిస్తే బెల్లం ఉపయోగించండి. చక్కెర ఎక్కువగా తినడం వల్ల మధుమేహం, గుండెపోటు, ఇతర వ్యాధులు సంభవిస్తాయి.

3. నూనె

అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వంటనూనె తగ్గించండి. అంతేకాదు కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్ వాడండి.

 

వారాంతాల్లో బయట తినడం లేదా ఇంట్లో కూర్చొని ఫాస్ట్ ఫుడ్ తినడం చాలా ప్రమాదం. దీనివల్ల కొలస్ట్రాల్‌ విపరీతంగా పెరుగుతుంది. ఈ ఆహారంలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు నాణ్యత లేని ఆహార పదార్థాలు ఉపయోగిస్తారు. అందుకే వెంటనే వీటిని తినడం మానెయ్యండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Tags:    

Similar News