Health Tips: చలికాలంలో బెల్లంతో ఈ ఆహారపదార్థాలను కలిపి తింటే ఈ వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు..

Health Tips: చలికాలం చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే రోగనిరోధక శక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం

Update: 2021-12-02 06:30 GMT

చలికాలంలో బెల్లంతో ఈ ఆహారపదార్థాలను కలిపి తింటే ఈ వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు.. (ఫైల్ ఇమేజ్)

Health Tips: చలికాలం చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే రోగనిరోధక శక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి కొన్ని పదార్థాలను కలిపి తింటే మంచి ఉపశమనం దొరుకుతుంది. శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సీజనల్‌ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే మామూలుగా తినడం వల్ల ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా పసుపును బెల్లంతో కలిపి తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మీకు జ్వరం లేదా కఫం సమస్య ఉంటే మీరు ఎండు అల్లం బెల్లం కలిపి తినాలి. ఈ రెండింటి కలయిక చాలా కంఫర్ట్‌ని ఇస్తుంది. చర్మం జుట్టుకు సంబంధించిన సమస్యలను తొలగించడానికి, హలీమ్ గింజలను బెల్లంతో కలిపి తినాలి. లడ్డూలు చేసి కూడా తినవచ్చు. ఇది శరీరంలోని ఫోలిక్ యాసిడ్, ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంటే బెల్లం, మెంతులు కలుపుకుని తినాలి. ఇది మీ నోటి ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం తినడం స్త్రీలకు చాలా మంచిది. ప్రసవం తర్వాత కోలుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మహిళల శరీరాన్ని బలపరుస్తుంది. ఎముకలను బలంగా చేస్తుంది.

బెల్లం ఉపయోగాలు

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు జింక్‌, సెలీనియం వంటి పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తీసుకుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. శ‌రీరంలో ఉన్న వ్యర్థ ప‌దార్థాల‌ను బ‌య‌టకు పంప‌డంలో బెల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. బెల్లంలో ఐరన్, పొటాషియం, ప్రోటీన్ వంటి పోషకాలు ఉన్నమాట వాస్తవమే. అవి శరీరానికి మేలు చేస్తాయి. ఏదైనా సరే అతిగా తింటే అనార్థమే. ఆ సూత్రం బెల్లంకు కూడా వర్తిస్తుంది. ముఖ్యండా డయబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా బెల్లానికి దూరంగా ఉండాలి. ఇది రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News