Health Tips: ఈ ఎర్రటి పండు గుండెకి ఫ్రెండ్‌.. ఎందుకో మీరే తెలుసుకోండి..!

Health Tips: నేటి రోజుల్లో హృద్రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

Update: 2023-02-12 01:30 GMT

Health Tips: ఈ ఎర్రటి పండు గుండెకి ఫ్రెండ్‌.. ఎందుకో మీరే తెలుసుకోండి..!

Health Tips: నేటి రోజుల్లో హృద్రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. రోజువారీ ఆహారపు అలవాట్లు, గందరగోళ జీవనశైలి దీనికి కారణం అవుతున్నాయి. చాలామంది ఆయిల్, జంక్, ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇవి రుచి పరంగా చాలా బాగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి చాలా చెడ్డవి. ఇది మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది క్రమంగా రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి ప్రమాదానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిలో ఒక ప్రత్యేక పండు తినడం వల్ల ఈ సమస్యలకి చెక్‌ పెట్టవచ్చు. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

చాలామంది వైద్యులు స్ట్రాబెర్రీలు గుండెకు చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు. ఈ ఎర్రటి పండులో చాలా పోషకాలు ఉంటాయి. గుండె దీర్ఘాయువు కోసం ప్రతిరోజూ స్ట్రాబెర్రీలను తినాలి. ఇది స్ట్రోక్ ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. స్ట్రాబెర్రీలు పాలీఫెనాల్ గొప్ప మూలంగా చెబుతారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీంతోపాటు స్ట్రాబెర్రీలోలో పాలీఫెనాల్ పుష్కలంగా లభిస్తుంది. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

ఒక రోజులో ఎన్ని స్ట్రాబెర్రీలు తినాలి?

చాలా మంది ఆరోగ్య నిపుణులు రోజూ 2 నుంచి 3 కప్పుల ముక్కలు చేసిన స్ట్రాబెర్రీలను తినాలని చెబుతున్నారు. దీని కారణంగా శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్ పెరగడం ప్రారంభమవుతుంది. మీరు గుండెపోటును నివారించాలంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించాలి. స్ట్రాబెర్రీలను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిశోధనలు రుజువు చేశాయి.

Tags:    

Similar News