Watermelon: పుచ్చకాయను న్యాచ్‌రల్‌గా తినండి.. కానీ ఈ పద్దతిలో మాత్రం ట్రై చేయొద్దు..!

Watermelon: ఎండాకాలం మొదలైందంటే చాలు కొంతమంది దాహం దాహం అంటూ అలమటిస్తుంటారు.

Update: 2024-03-21 13:00 GMT

Watermelon: పుచ్చకాయను న్యాచ్‌రల్‌గా తినండి.. కానీ ఈ పద్దతిలో మాత్రం ట్రై చేయొద్దు..!

Watermelon: ఎండాకాలం మొదలైందంటే చాలు కొంతమంది దాహం దాహం అంటూ అలమటిస్తుంటారు. పెరిగిన వేడి, పొడిగాలుల వల్ల తొందరగా డీ హైడ్రేషన్‌కు గురవుతారు. ఇలాంటి వారు ఎక్కువగా వాటర్‌ కంటెంట్‌ ఉన్న ఫ్రూట్స్‌, డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకుంటారు. తక్కువ ధరకు దొరికే పుచ్చకాయపై ఎక్కువగా ఆధారపడుతారు. ఇందులో లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎండాకాలం శరీరాన్ని డీ హైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ దీనిని తినే విషయంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వేసవిలో పుచ్చకాయ తింటే శరీరం చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 92శాతం నీరు మాత్రమే ఉంటుంది. ఇది మన శరీరానికి ఎక్కువ వాటర్ కంటెంట్ అందిస్తుంది. తాజా పుచ్చకాయలో సిట్రులిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది రక్తపోటు అదుపులో ఉంచుతుంది. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరంలో చక్కెర శాతాన్ని కంట్రోల్‌ చేస్తుంది. డైటింగ్ చేసేవారికి పుచ్చకాయ దివ్యవౌషధం. కానీ కొందరు పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచి తింటారు. ఇలా చేయడం వల్ల పోషక విలువలు తగ్గుతాయి.

మార్కెట్ నుంచి పుచ్చకాయలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని ఫ్రిజ్‌లో పెడుతారు. ఇలా అస్సలు చేయవద్దు. పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది. అప్పుడే దీని ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. ఇంకొందరికి పుచ్చకాయ కట్‌చేసి మరీ ఫ్రిజ్‌లో పెట్టే అలవాటు ఉంటుంది. ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్ లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా కోసిన పుచ్చకాయపై బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనిని తినడం వల్ల రోగాలు వెంటనే దరిచేరుతాయి.

Tags:    

Similar News