Health Tips: శరీరంలో ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? ఈ ఆహారాలను తినండి..!

Health Tips: నేటి జీవనశైలిలో శరీరానికి అవసరమైన పోషకాలు, ముఖ్యంగా జింక్ లోపించడం సాధారణంగా జరుగుతుంది. దీనివల్ల బలహీనత, అలసట, పని చేయాలనే ఉత్సాహం లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Update: 2025-06-12 05:30 GMT

Health Tips: శరీరంలో ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? ఈ ఆహారాలను తినండి..!

Health Tips: నేటి జీవనశైలిలో శరీరానికి అవసరమైన పోషకాలు, ముఖ్యంగా జింక్ లోపించడం సాధారణంగా జరుగుతుంది. దీనివల్ల బలహీనత, అలసట, పని చేయాలనే ఉత్సాహం లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాత్రి బాగా నిద్రపోయినా కూడా ఉదయం లేచి అలసటగా అనిపిస్తే అది జింక్ లోపం వల్ల కావచ్చు. అలాంటి సమయంలో జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే, వేటిని తినడం ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

మసూర్ పప్పు

మసూర్ పప్పులో జింక్ ఉంటుంది. ఇది మంచి ప్రోటీన్ మూలం కూడా. శాకాహారులకు ఇది మంచి మార్గం. మసూర్ పప్పు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అంతేకాకుండా అలసట కూడా తగ్గుతుంది.

శనగలు

100 గ్రాముల ఉడికించిన శనగల్లో సుమారు 1.5 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్ కూడా ఉంటాయి. రోజూ ఉదయం నానబెట్టిన శనగలు లేదా శనగల సలాడ్ తీసుకుంటే శక్తి పెరుగుతుంది. అలాగే అలసట కూడా తగ్గుతుంది.

గుడ్లు

గుడ్లలో జింక్ తో పాటు బి12 విటమిన్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. గుడ్లు తినడం వల్ల శరీరంలో జీవక్రియ వేగవంతమవుతుంది. రోజూ 1 లేదా 2 గుడ్లు తినడం వల్ల శక్తి పెరిగి అలసట తగ్గుతుంది.

ఈ ఆహారాలు మితంగా, మీ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Tags:    

Similar News