Dates Benefits: దీర్ఘాయువు కోసం ఖర్జూర.. గర్భిణీలకి వరంలాంటిది..!

Dates Benefits: దీర్ఘాయువు కోసం ఖర్జూర.. గర్భిణీలకి వరంలాంటిది..!

Update: 2022-10-20 05:05 GMT

Dates Benefits: దీర్ఘాయువు కోసం ఖర్జూర.. గర్భిణీలకి వరంలాంటిది..!

Dates Benefits: ఖర్జూరాలను సహజ తీపి పదార్థాలు అంటారు. ఇది భారతదేశంలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకుంటారు. ఇది షేక్స్, స్వీట్లు, అనేక రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. ఖర్జూరం అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గర్భిణీలకి చాలా మంచిదని అనేక అధ్యయనాలలో తేలింది. ప్రెగ్నెన్సీ సమయంలో ఖర్జూరం తినడం వల్ల లేబర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఖర్జూరం వల్ల కలిగే ప్రయోజనాలు

1. ఖర్జూరంలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇది యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఖనిజాలు, విటమిన్ల నిధి. వీటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది. రేగు, అత్తి పండ్ల కంటే ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని ఒక అధ్యయనంలో తేలింది.

2. ఖర్జూరం మధుమేహం, అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్ కళ్లు, గుండెకు చాలా మేలు చేస్తాయి.

3. విటమిన్లు B1, B2, B3, B5, A1తో పాటు అనేక రకాల అమైనో ఆమ్లాలు ఖర్జూరంలో ఉంటాయి. గర్భిణీ ప్రసవానికి ఒక నెల ముందు ఖర్జూరం తినడం ప్రారంభిస్తే ఆమె సాధారణ ప్రసవానికి అవకాశాలు పెరుగుతాయని ఒక అధ్యయనం కనుగొంది. గర్భధారణ సమయంలో ఖర్జూరం తినడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు.

Tags:    

Similar News