Health Tips: ఎముక గట్టితనం కోసం ఇదొక్కటి చేయండి.. ఫలితాలు తెలిస్తే షాక్‌ అవుతారు..!

Health Tips: నేటి రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలామందిలో ఎముకల సమస్యలు మొదలవుతున్నాయి.

Update: 2023-08-10 14:00 GMT

Health Tips: ఎముక గట్టితనం కోసం ఇదొక్కటి చేయండి.. ఫలితాలు తెలిస్తే షాక్‌ అవుతారు..!

Health Tips: నేటి రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలామందిలో ఎముకల సమస్యలు మొదలవుతున్నాయి. అంతేకాకుండా ఆల్కహాల్‌ తీసుకోవడం, సిగరెట్‌ తాగడం వల్ల కూడా ఎముకలు పెలుసుగా మారుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎముకల సమస్యలు అధికమవుతాయి. అయితే ఈ సమస్యని చిన్న చిట్కాతో నయం చేసుకోవచ్చు. ఇందుకోసం పెద్దగా డబ్బు కూడా ఖర్చుచేయవలసిన అవసరం లేదు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉదయమే రాగిజావ తాగడం వల్ల ఎముకల సమస్యలు తగ్గిపోయి బలంగా మారుతాయి. ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి. రాగిజావ మంచి అల్పాహారమని చెప్పవచ్చు. ఇందులో పాలు కలిపితే ఇది మరింత పోషకంగా మారుతుంది. రాగులు అలాగే పాలు కాల్షియంకు మంచి మూలం. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి అధిక బరువును తగ్గించుకోవడానికి రాగిజావ సహాయపడుతుంది. బాలింతలలో చనుబాలు పెంచడానికి కూడా ఇది పనిచేస్తుంది. దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కావాలసిన పదార్థాలు

1. రాగి పిండి - 2 టేబుల్ స్పూన్లు

2. పాలు- 250 మి.లీ

3. బెల్లం - 2 టీస్పూన్లు

4. యాలకుల పొడి- అవసరం మేరకు

రాగి జావ తయారీ విధానం

ముందుగా పాలు తీసుకొని స్టవ్‌పై వేడిచేసి అందులో రాగిపిండి వేయాలి. ముద్దలు కాకుండా తరచుగా కలుపుతూ ఉండాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. పిండి 2 నిమిషాలు ఉడకిన తర్వాత బెల్లం వేసి బాగా కలపాలి. తర్వాత యాలకుల పొడి చల్లాలి. అంతే వేడి వేడి రాగిజావ తయారైనట్లే. కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకోవాలి. ప్రతిరోజు తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయి.

Tags:    

Similar News