Health Tips: ఈ ఖరీదైన పండు ఆరోగ్యానికి ఔషధం.. ఈ వ్యాధులు దూరం..!

Health Tips: ఈ ఖరీదైన పండు ఆరోగ్యానికి ఔషధం.. ఈ వ్యాధులు దూరం..!

Update: 2023-01-16 01:30 GMT

Health Tips: ఈ ఖరీదైన పండు ఆరోగ్యానికి ఔషధం.. ఈ వ్యాధులు దూరం..!

Health Tips: డ్రాగన్ ఫ్రూట్ చూడటానికి కమలం పువ్వులా కనిపిస్తుంది. కానీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మార్కెట్‌లో సాధారణ పండ్ల కంటే దీని ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని శాస్త్రీయ నామం హిలోసెరస్ ఉండస్. దీనిని భారతదేశంలో 'కమలం' అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా లాటిన్ అమెరికా దేశాలలో ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ భారతదేశానికి కూడా దిగుమతి అవుతుంది.

1.డయాబెటిస్‌లో ప్రయోజనం

మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే డ్రాగన్ ఫ్రూట్ ఔషధం కంటే తక్కువేమి కాదు. మధుమేహానికి శాశ్వత నివారణ లేదు కానీ డ్రాగన్‌ ఫ్రూట్‌ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

2.రోగనిరోధక శక్తి పెరుగుతుంది

కరోనా యుగంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అందరు ప్రయత్నిస్తున్నారు. యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్ లక్షణాలు డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3.జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది

డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే పోషకాలు జుట్టు,చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఉండే డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

4.జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది

డ్రాగన్ ఫ్రూట్‌లో ఒలిగోశాకరైడ్స్ అనే రసాయనానికి సంబంధించి ప్రీబయోటిక్ మూలకాలు ఉన్నాయి. ఇవి పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఏర్పడటానికి సహాయపడతాయి. దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది.

5.దంతాలు దృఢం

మీ దంతాలలో నొప్పి ఉంటే అవి బలహీనంగా ఉంటే తప్పనిసరిగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవాలి. కాల్షియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉంటాయి. ఇవి దంతాలను బలంగా చేస్తాయి.

Tags:    

Similar News