Almonds Side Effects: బాదం పొట్టు తీయకుండా తినకండి.. ఎందుకంటే..?

Almonds Side Effects: బాదం గింజల గురించి అందరికి తెలుసు. బాదంపప్పు మెదడుకు దివ్యౌషధంగా చెప్పవచ్చు.

Update: 2022-09-06 03:30 GMT

Almonds Side Effects: బాదం పొట్టు తీయకుండా తినకండి.. ఎందుకంటే..?

Almonds Side Effects: బాదం గింజల గురించి అందరికి తెలుసు. బాదంపప్పు మెదడుకు దివ్యౌషధంగా చెప్పవచ్చు. ఈ చెట్టు పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆసియాలోని ఇరాన్, ఇరాక్, మక్కా, షిరాజ్ ప్రాంతాల్లో బాదం చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని సరిగ్గా తీసుకుంటే మెదడులోని న్యూరాన్‌లను సక్రియం చేయడం సులభం అవుతుంది. బాదంపప్పును సరైన రీతిలో తీసుకోవడం గురించి తెలుసుకుందాం.

బాదంపప్పులో టానిన్ సాల్ట్ సమ్మేళనం ఉంటుంది. అందుకే బాదంపప్పును పొట్టుతో కలిపి తినకూడదు. చాలా మంది తొందరపాటు కారణంగా బాదంపప్పులను పొట్టుతో తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల మీరు వ్యాధుల బారిన పడవచ్చు. తొక్కతో సహా బాదంపప్పును తినడం వల్ల కొన్ని కణాలు పేగులలో చిక్కుకుపోతాయి. దీని వల్ల కడుపు నొప్పి, మంట, గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంది. అందుచేత బాదంపప్పు తొక్క తీసి తినాలి.

బాదంపప్పును ఇంట్లో వంటలలో కూడా ఉపయోగిస్తారు. బాదం పప్పును రోజూ తినే వారు వాటని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పొట్టు తీసి తినాలి. ఇది బాదంపప్పు వేడిని తగ్గిస్తుంది. బాదంపప్పును ఉదయాన్నే గ్రైండ్ చేసి పాలలో కలుపుకుని కూడా తాగవచ్చు. అలాగే రోస్ట్ చేసి సాయంత్రం పూట చిరుతిండిగా తినవచ్చు. డైటీషియన్లు రోజుకు 5 నుంచి 8 బాదంపప్పులు తినాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News