Dog Bite: కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి?

Dog Bite: ఇప్పుడు చాలామంది కుక్కలను ఎంతో ఇష్టంతో పెంచుకుంటున్నారు. వేల రూపాయలు పెట్టి మరీ వాటిని కొని, పెంచుతున్నారు. అయితే ఒక చిన్న కాటు జీవితాన్ని రిస్క్‌లో పడేస్తుంది.

Update: 2025-07-02 15:56 GMT

Dog Bite: కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి?

Dog Bite: ఇప్పుడు చాలామంది కుక్కలను ఎంతో ఇష్టంతో పెంచుకుంటున్నారు. వేల రూపాయలు పెట్టి మరీ వాటిని కొని, పెంచుతున్నారు. అయితే ఒక చిన్న కాటు జీవితాన్ని రిస్క్‌లో పడేస్తుంది. ఒక చిన్న గాయమే కదా అని ఊరుకోకూడదు. ఎందుకంటే అది ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అందుకే కుక్క కరిచిన వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకుని, వెంటనే డాక్టర్‌‌ని సంప్రదించాలి.

కుక్కను చాలా ప్రేమగా పెంచుతారు. కానీ ఒక్కొక్కసారి కుక్కలు అగ్రెసివ్ అయిపోతుంటాయి. అలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా పెట్ డాగ్‌తో వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు పెంచిన కుక్కే కదా అని అనుకోకూడదు. కుక్క సహజ లక్షణం కొరకడం. కాబట్టి అది ఎప్పుడైనా కొరికే అవకాశం ఉంటుంది. అయితే ఇష్టమైన వారిని అది ఎక్కువ గట్టిగా కొరకదు. కానీ ఒక్కొక్కసారి అగ్రెసివ్‌గా ఉన్నప్పుడు మాత్రం గట్టిగా కొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి కుక్క కరిచిన వెంటనే ఇలా చేయండి.

వివరాలు తెలుసుకోవాలి

ఇంట్లో పెంచుతున్న కుక్క కరిచినా, వీధి కుక్క కరిచినా వెంటనే దాని వివరాలు తెలుసుకోవాలి. ఇంట్లో పెంచుతున్న కుక్క అయితే దానికి రాబిస్ వ్యాక్సిన్ వేసారో లేదో తెలుసుకోవాలి. అంతేకాదు ఆ కుక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. అప్పుడు దానిబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి.

గాయని శుభ్రపరిచిండిలా..

కుక్క కరిచిన వెంటనే గాయం ఎంత అయిందో చూసుకోవాలి. వెంటనే దాన్ని సబ్బు లేదా నీటితో క్లీన్ చేయాలి. పోవిడోన్ అయోడిన్ వంటి యాంటీ బయాటిక్ అయింట్ మెంట్‌ను గాయంపై అప్లై చేయాలి. వెంటనే డాక్టర్‌‌ని సంప్రదించాలి. ఎందుకంటే కుక్కలో ఉన్న బ్యాక్టీరియా పళ్ల ద్వారా మనిషి శరీరంలోకి చేరిపోతుంది. ఇది ప్రాణాలకే ప్రమాదం.

దెబ్బను పరిశీస్తూ ఉండాలి

గాయం అయిన ప్రదేశాన్ని పరిశీలిస్తూ ఉండాలి. దానిలో వచ్చే మార్పులను గమనించాలి. ఎర్రగా మారడం, వాపు, నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌‌ దగ్గరకు వెల్లాలి.

ఆరోగ్యం సరిగా లేకపోతే..

కుక్క కరిచిన వారి ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా ప్రమాదమే. అందుకే వారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా లేకపోయినా, డయాబెటీస్ ఉన్నవాళ్లయినా జర జాగ్రత్తగా ఉండాలి. తొందరగా వీళ్లకి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది.

కాటు లోతుగా ఉంటే..

కాటు లోతుగా ఉంటే నరాలు, కండరాలు లేదా రక్తనాళాలకు తీవ్రనష్టం జరిగే అవకాశం ఉంది. పెద్ద కుక్కలు ఎముకలు విరగేలా కూడా కొరకగలవు. అందుకే ఒకవేళ పెద్ద కుక్క కరిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.

గాయంపై మార్పులు వచ్చినా.. శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా వెంటనే డాక్టర్ ని సంప్రదించి అన్ని వివరాలు స్పష్టంగా తెలియజేయాలి.

Tags:    

Similar News