Dog bite: కుక్క కాటుతో జర జాగ్రత్త.. మీ వీధుల్లో కుక్కలు పెరుగుతున్నాయ్..
Dog bite: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వీధి కుక్కలు పెరిగిపోతున్నాయి. దీంతొ పిల్లలు, పెద్దల మీదకు ఎగబడిపోతున్నాయి. విపరీతంగా కరుస్తున్నాయి. ఇలా కుక్కకాటు బలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది.
Dog bite: కుక్క కాటుతో జర జాగ్రత్త.. మీ వీధుల్లో కుక్కలు పెరుగుతున్నాయ్..
Dog bite: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వీధి కుక్కలు పెరిగిపోతున్నాయి. దీంతొ పిల్లలు, పెద్దల మీదకు ఎగబడిపోతున్నాయి. విపరీతంగా కరుస్తున్నాయి. ఇలా కుక్కకాటు బలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. అయితే అవి కరవడం వల్ల వచ్చే రాబిస్ వ్యాధి మాత్రమే కాదు పలు రకాల జబ్బులకు గురి అయ్యే ప్రమాదం ఉందని వైద్య శాఖ చెబుతోంది.
ప్రస్తుతం పల్లె, పట్నం అనే తేడా లేకుండా కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైద్య శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఒక వీధులో కుక్కలు 20 నుంచి 30 వరకు తిరుగుతున్నాయి. ఇలా పెద్ద మొత్తంలో వీధి కుక్కలు తిరుగుతుండడంతో ఎప్పుడు ఏ క్షణాన్న ప్రజలపై దాడికి దిగుతున్నాయో తెలియడం లేదు. కొంతమంది వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతుంటే మరికొంతమంది తీవ్ర గాయాలై హాస్పిటల్ పాలవుతున్నారు.
వైద్య శాఖ గణాంకాల ప్రకారం, మన రాష్ట్రంలో గత ఏడాదిలో 1,68,367 మంది కుక్క కాటుకు గురయ్యారని తెలుస్తోంది కేవలం హైదరాబాద్ నగరంలోనే 6.5 లక్షల కుక్కలు ఉన్నట్టు, అవి రోజుకు సమారు 400 మందిని కాటు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కుక్కలతోపాటు కోతులు, పాముల బెడద కూడా బాగా పెరిగిపోయింది.
రాష్ట్రం మొత్తం మీద చూస్తే పెంపుడు కుక్కల కాటుకు 29 శాతం మంది బలవుతుంటే 71 శాతం మంది వీధి కుక్కల కాటుకు గాయపడుతున్నారు. ఇలా కుక్కలు కరుస్తూ వెళితే మనిషి శరీరంలో ఒక లాంటి విషం పెరుగుతూ వెళుతుందని వైద్యులు చెబుతున్నారు. ర్యాబిస్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులతో పాటు పలు రకాల వైరస్‌ల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే కుక్క కరిచిన వెంటనే వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు.