Health Tips: రొట్టె తినడం వల్ల బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!

Health Tips: నేటి రోజుల్లో వివిధ రకాల ఆహార శైలి కారణంగా చాలామంది స్థూలకాయులుగా మారుతున్నారు.

Update: 2022-12-02 15:01 GMT

Health Tips: రొట్టె తినడం వల్ల బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!

Health Tips: నేటి రోజుల్లో వివిధ రకాల ఆహార శైలి కారణంగా చాలామంది స్థూలకాయులుగా మారుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ డైటింగ్‌ చేయడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వారు ఏమి తినాలి ఏమి తినకూడదు అనే ప్రశ్న వారి మనస్సులో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. అలాగే డైటింగ్‌లో రోటీ తినాలా వద్దా అనే సందేహం కూడా ఉంటుంది. మీరు కూడా ఈ విషయంలో గందరగోళంలో ఉన్నట్లయితే రోటీ గురించి డైటీషియన్ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం.

గోధుమ రోటీలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నించేవారు వీటిని ఎక్కువగా తినకూడదనే చెప్పాలి. కానీ రోటీ తినడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి. డైటీషియన్ ప్రకారం అయితే బరువు తగ్గాలనుకునే వారికి రోటీ ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే తక్కువగా తీసుకుంటే బెటర్. మీడియం సైజ్ రోటీ 120 కేలరీలు కలిగి ఉంటుంది.

కార్బోహైడ్రేట్స్‌ ప్రకారం చూసుకుంటే రోటి తినకూడదు. కానీ రొట్టెలో విటమిన్ B1 ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది. మీరు మల్టీగ్రెయిన్ రోటీని తింటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని పెంచదు. అందువల్ల డయాబెటిక్ రోగులు మల్టీగ్రెయిన్ రోటీని తినవచ్చు. పురుషులకు రోజుకు 1700 కేలరీలు అవసరమవుతాయి కాబట్టి వారు లంచ్, డిన్నర్‌లో మూడు రోటీలు తినవచ్చు. అదే సమయంలో మహిళలకు రోజుకు 1400 కేలరీలు అవసరం వారు లంచ్, డిన్నర్‌లో రెండు రోటీలు తినవచ్చు. అయితే వీటితో పాటు కూరగాయలు, పప్పులని ఎక్కువగా తీసుకోవాలి.

Tags:    

Similar News