Health Tips: నిద్రలేచిన వెంటనే ముఖం అందంగా కనిపించాలా.. ఈ సూపర్‌ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: ప్రతి ఒక్కరూ అందమైన, మెరిసే చర్మం ఉండాలని కోరుకుంటారు.

Update: 2023-02-08 02:30 GMT

Health Tips: నిద్రలేచిన వెంటనే ముఖం అందంగా కనిపించాలా.. ఈ సూపర్‌ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: ప్రతి ఒక్కరూ అందమైన, మెరిసే చర్మం ఉండాలని కోరుకుంటారు. కానీ ఇది అందరికి సాధ్యంకాదు. ఎందుకంటే మన జీవనశైలి మొత్తం మారిపోయింది. మనం రోజు తినే ఆహారం చర్మంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మీరు చాలా కాలం పాటు బయటి ఆహారాన్ని తింటుంటే చర్మం నిర్జీవంగా, వాడిపోయినట్లు కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో కొన్ని సూపర్‌ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి శరీరం నుంచి విషాన్ని బయటకు తీయడంలో సహాయపడుతాయి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తాయి. అలాంటి ఆహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

దానిమ్మ

దానిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోజు తీసుకునే డైట్‌లో దానిమ్మను చేర్చుకుంటే అది మీ చర్మాన్ని యవ్వనంగా, చాలా కాలం పాటు మెరిసే విధంగా చేస్తుంది.

దోసకాయ

దోసకాయలో విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దోసకాయలు తినడం వల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలను పొందవచ్చు. దోసకాయ ముక్కలను కళ్లపై ఉంచుకోవడం వల్ల నల్లటి వలయాలు పోతాయి. దోసకాయ రసం చర్మంలోని మురికిని తొలగిస్తుంది.

పసుపు

పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందుకే పసుపును తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. పసుపును కూరగాయ, పాలు లేదా రసం, సూప్ వంటివి తయారు చేయడం ద్వారా తీసుకోవచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో, వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో సహాయపడుతాయి. అంతేకాదు బరువుని కూడా సులువుగా తగ్గిస్తుంది.

Tags:    

Similar News