Health Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్‌లో ఈ మార్పులు చేయండి..!

Health Tips: చెమట పట్టడం అనేది సాధారణంగా ప్రతి ఒక్కరిలో జరిగే ప్రక్రియే. అయినప్పటికీ కొంతమందికి సాధారణం కంటే ఎక్కువగా చెమటలు పడుతాయి.

Update: 2022-06-25 15:30 GMT

Health Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్‌లో ఈ మార్పులు చేయండి..!

Health Tips: చెమట పట్టడం అనేది సాధారణంగా ప్రతి ఒక్కరిలో జరిగే ప్రక్రియే. అయినప్పటికీ కొంతమందికి సాధారణం కంటే ఎక్కువగా చెమటలు పడుతాయి. అయితే ఇది మామూలు విషయం కాదు. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అధిక బరువు, బీపీ, మధుమేహం వంటి సమస్యలు దీని వెనుక ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మీరు ఈ సమస్యతో సతమతమవుతుంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. చెమట సమస్యను తగ్గించే కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి

ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం అవసరం. అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కాల్షియం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. ఇందుకోసం పాలు, పెరుగు, నువ్వులని డైట్‌లో చేర్చాలి.

అవిసె గింజలు

అవిసె గింజల ప్రయోజనాల గురించి మీరు తప్పక వినే ఉంటారు. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గించడం నుంచి బరువు తగ్గించడం వరకు ఉపయోగపడుతుంది. మీరు మీ శరీరం నుంచి ఎక్కువ చెమటని ఎదుర్కొంటున్నట్లయితే అవిసెగింజలు డైట్‌లో చేర్చుకోవాలి.

తగినంత నీరు తాగాలి

విపరీతమైన చెమట సమస్యతో బాధపడేవారు తగినంత నీరు తాగాలి. శరీరాన్ని నీటితో హైడ్రేట్ గా ఉంచాలి. దీని కారణంగా చెమట సమస్య తగ్గుతుంది. రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.

స్పైసీ ఫుడ్ మానుకోండి

చెమట సమస్యను నివారించడానికి మీరు తక్కువ స్పైసీ ఫుడ్ తినాలి. లేదంటే అసలు మానుకోవాలి. కెఫిన్ తీసుకోవడం తగ్గించండి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక చెమట పడుతుంది. ఎండలో తక్కువగా తిరగండి.

Tags:    

Similar News